రహస్యంగా రెజీనా ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరు?

Published : Jun 18, 2019, 04:25 PM IST
రహస్యంగా రెజీనా ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరు?

సారాంశం

హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఇదే. అందచందాలు, నటనతో ఆకట్టుకున్న రెజీనా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 

హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఇదే. అందచందాలు, నటనతో ఆకట్టుకున్న రెజీనా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఓ దశలో స్టార్ హీరోయిన్ రేసులో కూడా నిలిచింది. కానీ కథల ఎంపికలో లోపమో ఏమో కానీ రెజీనా నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. 

ఇటీవల రెజినాకు అవకాశాలు బాగా తగ్గాయి. ఇక రెజీనా ప్రేమ వ్యవహారాల గురించి కూడా తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. రెజీనా ఇటీవల తాను సన్నిహితంగా ఉంటున్న నటుడితో పెళ్ళికి వార్తలు వస్తున్నాయి. రహస్యంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కానీ రెజీనా మాత్రం మౌనంగానే ఉంది. 

గతంలో కొందరు హీరోయిన్లు రహస్యంగా వివాహం చేసుకుని ఆ తర్వాత మా పెళ్ళైపోయిందంటూ తీరిగ్గా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో రెజీనా కూడా షాక్ ఇవ్వబోతోందా అని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. గతంలో రెజీనా ఓ హీరోతో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తమ మధ్య అలాంటిదేమి లేదని, తామిద్దరం మంచి స్నేహితులం అని ఇద్దరూ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం