రామ్ చరణ్ భార్యని అనఫిషియల్ 'పీఆర్వో' అంటున్నారే

Published : Jan 08, 2019, 08:03 AM IST
రామ్ చరణ్ భార్యని అనఫిషియల్ 'పీఆర్వో' అంటున్నారే

సారాంశం

రామ్ చరణ్ గురించి, ఆయన సినిమాల గురించి అఫీషియల్ అప్ డేట్స్  మనందరికి ఇస్తున్నది ఎవరు అనుకుంటున్నారు..ఉపాసన కొణిదెల. రామ్ చరణ్ కు సంభందించి ఏ అప్ డేట్ ఇస్తే బాగుంటుంది

రామ్ చరణ్ గురించి, ఆయన సినిమాల గురించి అఫీషియల్ అప్ డేట్స్  మనందరికి ఇస్తున్నది ఎవరు అనుకుంటున్నారు..ఉపాసన కొణిదెల. రామ్ చరణ్ కు సంభందించి ఏ అప్ డేట్ ఇస్తే బాగుంటుంది..ఏ పిక్ పోస్ట్ చేస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఏ టైమ్ లో ఏ వీడియో రిలీజ్ చేస్తే జనంలోకి బాగా వెల్తుంది అనే విషయాలు గమనించి అలా పోస్ట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ట్విట్టర్ లో అనీపిషియల్ పీఆర్వో లా పనిచేస్తున్నారు. 

తెలుగు పరిశ్రమ లో బెస్ట్ కపుల్స్ లో మెగాస్టార్ పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉంటారు. ఉపాసన తన భర్త గురించి, వ్యక్తిగత విషయాలు, ఆయన సినిమాల అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.   సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేంత టైం లేదు కాబట్టి చరణ్ కన్నా ఎక్కువ ఉపాసన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. 

ప్రస్తుతం, రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయరామ  సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ  హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

   

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?