జాన్వీ కపూర్ పాత్రను, ఓ హిట్ సాంగ్ ని కట్ చేసేసారు. అయితే ఇలా కట్ చేయటానికి ఎన్టీఆర్ సలహానే కారణం అనే ప్రచారం జరుగుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఆరేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. అయితే అదేంటో కానీ ఈమెకి ఇప్పటి వరకు సరైన కమర్షియల్ హిట్ పడలేదు. తాజాగా ప్యాన్ ఇండియా లెవిల్ లో రిలీజైన దేవర పార్ట్-1పై ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకి నిరాశే ఎదురైంది. ఈ సినిమా నార్త్ లో పెద్దగా ఓపినింగ్స్ రాలేదు. సరికదా ఇక్కడ కూడా డివైడ్ టాక్ నడుస్తోంది. ఇవన్నీ ప్రక్కన పెడితే ఆమె పాత్రను, ఓ హిట్ సాంగ్ ని కట్ చేసేసారు. అయితే ఇలా కట్ చేయటానికి ఎన్టీఆర్ సలహానే కారణం అనే ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి మొదటి నుంచి జాన్వీకు బాలీవుడ్ లో సక్సెస్ కావాలన్నదే కోరిక. అక్కడ తను ఫామ్ లో ఉన్నప్పుడు మిగతా భాషల్లోకి వెళ్లి దుమ్ము రేపుదామనుకుంది. అయితే బాలీవుడ్ లో అసలే సక్సెస్ రేటు బాగా తక్కువగా ఉంది. దానికి తోడు ఆమె ఎంచుకున్న కథలు సైతం కలిసి రాలేదు. ఈ క్రమంలో శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ కు హిందీలో సక్సెస్ కాలేదు. దాంతో సౌత్ లో ఎంట్రి ఇచ్చి తన తల్లిలాగ ఇక్కడ జెండా పాతుదామనుకుని సినిమా చేసింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
మొదట ఈ పాత్రకు అలియా భట్ ను అనుకున్నారు. కానీ అలియా భట్ దేవర ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారు కొరటాల. దేవర చిత్రంలో తంగం కేరెక్టర్ లో పరిచయమైన జాన్వీ కపూర్ కు దేవర కు మంచి మార్కులే ప డ్డాయి. అయితే ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో కాదు. దాంతో సౌత్ లో జాన్వీ కపూర్ బోణి కొట్టిందా డౌట్ గా మారింది. బాలీవుడ్ మీడియా అక్కడ తెలుగుకు వెళ్లి సాధించింది ఏమీ లేదు అన్నట్లు కథనాలు మొదలెట్టేసారు.
జాన్వీని బాలీవుడ్ మీడియా అనటానికి కూడా కారణం ఉంది. దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్ పాత్ర 20 నిమిషాల కన్నా ఎక్కువ కనిపించదు. సెకండ్ హాఫ్ లో తంగం గా చలాకీగా కనిపించిన జాన్వీ కపూర్ పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. అంతకు మించి జాన్వీ కపూర్ గురించి పార్ట్ 1లో చెప్పుకోవడానికి లేదు. జాన్వి మొదటి నుంచి చెప్పినట్టుగానే దేవర 2 లో ఆమె పాత్ర హైలెట్ అయ్యేలా కనిపిస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కొరటాల హీరో ఎలివేషన్స్, యాక్షన్ మీద దృష్టి పెట్టడంతో హీరో, హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ట్రాక్ కి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్టీఆర్ తో జాన్వీ ప్రేమ పండలేదు.
అయితే జాన్వీకపూర్ ‘చుట్టమల్లె’ పాటలో అయితే డాన్స్ చేసి దుమ్ము రేపింది. క్యారక్టర్ లెంగ్త్ తక్కువైనా బాగానే గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది. జాన్వీ అసలు ఫస్టాఫ్‌లో అసలు కనిపించలేదు. సెకండాఫ్‌లోనూ తను ఉన్నది నాలుగైదు సీన్లే. రెండు పాటల్లో డాన్స్ చేసినా.. అందులో ఒక పాట పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ క్రమంలో జాన్వీ స్క్రీన్ టైమ్ మరీ ఇంత తక్కువ ఉందేంటి? అని ఆశ్చర్యపోయిన వాళ్లు ఉన్నారు.
అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జాన్వీ కపూర్ సీన్స్, పాట ఫైనల్ కట్ లోనే చాలా భాగం పోయాయట. దాదాపు ఏడు నిముషాల దాకా కట్ చేసారట. దావూది సాంగ్ కూడా తీసేసారు. ఆ పాటను సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ యాడ్ చేద్దామనేది కొరటాల ఆలోచనట. అయితే అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. ఫైనల్ కట్ లో కూర్చున్న ఎన్టీఆర్ సెకండాఫ్ లో రొమాన్స్ సినిమా రన్ కు అడ్డం వస్తోందని,లాగ్ గా భావించి ట్రిమ్ చేయించారట. ఎన్టీఆర్ సలహా, సూచనలు మేరకే జరిగింది కాబట్టి నో కామెంట్ అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.