‘గ్యాంగ్‌లీడర్‌’ కథ కొరియన్ కాపీ మ్యాటర్ పై నాని స్పందన!

By AN TeluguFirst Published Sep 13, 2019, 9:57 AM IST
Highlights

Girl Scout కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అయితే అనుకోని విధంగా ఆ డబ్బుని తీసుకుని ఒకరు జంప్ అయ్యిపోతారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురు ఆ డబ్బు పట్టుకుని పారిపోయిన వ్యక్తిని ఎలా పట్టుకునేరనే పాయింట్ తో కథ జరుగుతుంది. 

ఈ మధ్యకాలంలో దాదాపు  ప్రతీ పెద్ద సినిమాకు కాపీ వివాదం వెంటాడుతోంది.  ప్రతీ సినిమా కథ... ఏదో భాష సినిమా నుంచి కాపీ కొట్టారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని నిజమవుతున్నాయి. చాలా వరకూ రూమర్స్ గా మిగిలిపోతున్నాయి. రీసెంట్ గా సాహో చిత్రం కాపీ వివాదంపై ఫ్రెంచ్ డైరక్టర్ సైతం స్పందించారు. ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ సైతం ఓ కొరియా సినిమా నుంచి లేపారంటూ గత కొద్ది రోజులుగా వినపడుతోంది.  Girl Scout అని 2008లో వచ్చిన  ఓ చిత్రం స్టోరీలైన్ ని,కామెడీని తీసుకుని ఈ కథ తయారు చేసినట్లు చెప్తున్నారు. ఈ విషయమై నాని మీడియా తో మాట్లాడారు.

ఓ కొరియన్‌ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని 'గ్యాంగ్‌లీడర్‌' చేశారట అని మీడియావారు అడగగా... హీరో నాని స్పందిస్తూ...అది ఏ సినిమానో మీరే చెప్పండి. ప్రతి వాళ్లకు ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది. ఎవరో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. దాన్ని మీరే సరిచూసుకోవాలి అని తేల్చి చెప్పారు.

 Girl Scout కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అయితే అనుకోని విధంగా ఆ డబ్బుని తీసుకుని ఒకరు జంప్ అయ్యిపోతారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురు ఆ డబ్బు పట్టుకుని పారిపోయిన వ్యక్తిని ఎలా పట్టుకునేరనే పాయింట్ తో కథ జరుగుతుంది. అయితే తెలుగు నేటివిటిని అద్ది ఈ కథను సాన పట్టి స్క్రీన్ ప్లే రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగితే సరిపోతుంది.  

నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌  హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రానికి  విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబరు 13న) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మంచి హిట్టైంది.  

click me!