నాదెండ్ల హఠాత్తుగా మౌనం, తెర వెనక ఏం జరిగింది?

By Udaya DFirst Published Feb 24, 2019, 3:07 PM IST
Highlights

ఈ నెల 22న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల అయ్యింది. ఈ  ‘మహానాయకుడు’ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించారు. ఈ నేపథ్యంలో 'మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను నెగెటివ్ రోల్ గా చూపించిన విషయం తెలిసిందే. 

ఈ నెల 22న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల అయ్యింది. ఈ  ‘మహానాయకుడు’ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించారు. ఈ నేపథ్యంలో 'మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను నెగెటివ్ రోల్ గా చూపించిన విషయం తెలిసిందే. 

అయితే కథానాయకుడు చిత్రం రిలీజ్ అయిన తర్వాత టీవి ఛానెల్స్ లో కనపడి రచ్చ రచ్చ చేసిన ఆయన మహానాయకుడు తర్వాత మరింతగా రెచ్చిపోతారని అంతా భావించారు. అయితే చిత్రంగా ఆయన మౌనం వహించారు. ఎక్కడా ఆయన మాట వినపడటం లేదు. ఏం జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరన్నా ఆయన్ని బెదిరించారా లేక కావాలనే ఆయన మాట్లాడటం ఆపేసారా..అని సందేహపడుతున్నారు. 

అయితే కావాలనే నాదెండ్ల వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మాట్లాడటం వల్ల మహానాయకుడు సినిమాకు మరింత పబ్లిసిటీ జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఛానెల్స్ లో డిబేట్స్ వల్ల సినిమాకు ప్లస్ అవుతుంది కానీ తనకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండని ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. తను మీడియా కు ఎక్కితే నిజంగానే సినిమాలో ఏదైనా వివాదాస్పద అంసం ఉందని జనం ఎగబడతారని భావించే తెలివిగా ఈ వ్యూహాత్మక మౌనం ఆశ్రయించారంటున్నారు.

చిత్రం రిలీజ్ ముందు ఇదే విషయమై ఆయన్ని ప్రశ్నించగా పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. గంటో, రెండు గంటలో ప్రేక్షకులను మభ్యపెట్టి పైసలు జేబులో వేసుకోపోయేదే ‘సినిమా’ అని అభిప్రాయపడ్డారు. కనుక, దీని గురించి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ చిత్రంలో తన పాత్రపై ఉన్న అభ్యంతరం గురించి చిత్రయూనిట్ తమను సంప్రదించలేదన్న విషయాన్ని తన న్యాయవాదులు తనకు చెప్పారని నాదెండ్ల వివరించారు.

click me!