‘సలార్ ’టీజర్‌కు ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్‌కు లింక్ నిజమా.?.యాధృచ్చికమా

Published : Jul 04, 2023, 06:40 AM IST
 ‘సలార్ ’టీజర్‌కు ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్‌కు లింక్ నిజమా.?.యాధృచ్చికమా

సారాంశం

 ప్రభాస్ సలార్  సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్ తో యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.


కేజీఎఫ్ 2 మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రేంజిలో సెన్సేషన్  క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ  మూవీ కంటే కూడా పది రెట్లు ఎక్కువగా ఉండేలా రూపొందించారు  సలార్ అని చెప్తూ వస్తున్నారు. కేజీఎఫ్ ప్రస్తావన లేకుండా సలార్ గురించి మాటలు రావటం లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదల చేసే డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసి అఫీషియల్ పర్కటన చేసారు. దాంతో మరోసారి కేజీఎఫ్ 2తో ఈ సినిమాకు ముడిపెట్టడం మొదలెట్టారు మనవాళ్లు.  ఈ మూవీ టీజర్‌కు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’మూవీకి ఉన్న సంబంధం ఇదే అంటూ ఓ పోస్ట్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. అదేంటో మీరు ఇక్కడ చూడవచ్చు.

టీజర్ రిలీజ్ చేస్తున్న  సమయాని కి అలాగే కేజిఎఫ్ పార్ట్ 2 క్లైమాక్స్ కు చాలా పెద్ద లింకు ఉంది వారు థీరీని ప్రచారంలోకి తెస్తున్నారు. కేజీఎఫ్ 2 చివర్లో .. రాఖీ బాయ్ పై జరిగే ఎటాక్ కూడా దాదాపు అదే సమయంలో జరుగుతుంది.  రాఖీపై కరెక్టుగా 5:12 కి సముద్రంలోకి పడిపోతాడు అని ఆ తర్వాత సలార్ కథ మొదలవుతుంది అని ఇప్పుడు ఎవరికి వారే ఊహించేసుకుంటున్నారు. క్లయిమాక్స్ లో గడియారాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కు వైరల్ చేస్తున్నారు. అయితే డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఇంత ఆలోచించి చేసారా..గడియారంలో5:05 చూపెడుతోంది కదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ రెండింటికి లింక్ ఉండదని, యాధృచ్చికంగా జరిగే విషయం ఇదని మరికొంతమంది కొట్టి పారేస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు.  ప్రభాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్ తో యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. సలార్ టీజర్‌ను విడుదల చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ జూలై 6, 5.12 గంటలకు విడుదల చేయనున్నారని ప్రకటించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?