కాపీ కథతో నాని 'జెర్సీ' మూవీ..?

Published : Jan 14, 2019, 11:40 AM IST
కాపీ కథతో నాని 'జెర్సీ' మూవీ..?

సారాంశం

వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న హీరో నానికి 'కృష్ణార్జున యుద్ధం' ఓ బ్రేక్ వేసింది. 'దేవదాసు' సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం నాగార్జునకి వెళ్లిపోయింది. 

వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న హీరో నానికి 'కృష్ణార్జున యుద్ధం' ఓ బ్రేక్ వేసింది. 'దేవదాసు' సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం నాగార్జునకి వెళ్లిపోయింది. దీంతో మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ క్రమంలో దర్శకుడు గౌతం తిన్ననూరి చెప్పిన 'జెర్సీ' కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మిడిల్ ఏజ్డ్‌ క్రికెటర్ పాత్రలో నాని కనిపించి ఆశ్చర్యపరిచాడు.

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముప్పై ఆరేళ్ల ఓ వ్యక్తి దేశం తరఫున క్రికెట్ ఆడాలని ప్రయత్నిస్తుంటాడు. క్రికెటర్లు రిటైర్ అయ్యే ఏజ్ లో మరి అతడు ఎలా దేశం తరఫున ఆడతాడనే పాయింట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ స్టోరీ లైన్ వింటుంటే 'ఇన్విన్సిబుల్' అనే హాలీవుడ్ సినిమాకి చాలా దగ్గరగా అనిపిస్తోంది. అందులో కూడా హీరో క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. అయితే అక్కడ హీరో ఫుట్ బాల్ టీమ్ లో చోటు కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సినిమా స్పూర్తితోనే 'జెర్సీ' సినిమా చేసినట్లుగా అనిపిస్తోంది. మరి పూర్తిగా అదే ఫార్మాట్ తో సినిమా ఉంటుందా..? లేక ఏమైనా మార్పులు చేశారా..? అనేది చూడాలి!

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌