Chiranjeevi Tweet : చరణ్ కు బర్త్ డే విషేస్ చెప్పడం చిరంజీవికి వింతగా ఉందంటా... ఎందుకంటే?

Published : Mar 27, 2022, 05:05 PM IST
Chiranjeevi Tweet : చరణ్ కు బర్త్ డే విషేస్ చెప్పడం చిరంజీవికి వింతగా ఉందంటా... ఎందుకంటే?

సారాంశం

మెగా స్టార్ చిరంజీవికి తన కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే  ఎంత ఇస్టమో మాటల్లో చెప్పలేము. అయితే చెర్రీ బర్త్ డే సందర్బంగా ఈ విధంగా విషెస్ చెప్పడం వింతగా ఉందంటూ చిరు ట్వీట్ చేశాడు. 

మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRR సందండి  నెలకొని ఉండంగానే... ఇటు చరణ్ బర్త్ వేడుకలను కూడా ఫ్యాన్స్ భారీ ఎత్తున నిర్వహించారు.  నిన్నటి నుంచే పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతూ చెర్రీని ఆనంద పరవంశంలో ముంచుతున్నారు. తమ అభిమానాన్ని చాటుకుంటూ చెర్రీ భారీ కటౌట్లు, పలు ఆర్ట్స్ వేస్తున్నారు. ఇందుకు చెర్రీ స్పందించి  అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

అలాగే చరణ్ కు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోషల్ మీడియా వేదికన త్రో బ్యాక్ పిక్స్ తో విషెస్ తెలిపారు. అల్లు అర్జున్ Allu Arjun, సాయి ధరమ్ తేజ్, నిహారిక తమ బెస్ట్ విషెస్ ను తెలిపారు. మరోవైపు సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు అందుకున్నాడు రామ్ చరణ్. అయితే చరణ్ బర్త్ డే సందర్బంగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా స్పెషల్ విషెష్ తెలిపారు. ఈ మేరకు చిరు, చరణ్ కలిసి ఉన్న ఆచార్య  మూవీ పిక్, చిన్నప్పటి ఫొటోను కలిపి అభిమానుల కోసం ట్విట్టర్ లో షేర్ చేశాడు.

అయితే, చరణ్ కు చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగానే బర్త్ డే విషెస్  చెప్తుండేవాడు చిరంజీవి. అయితే ఈ సారి మాత్రం చరణ్ కు ట్విట్టర్ లో కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా విష్ చేయడం చిరుకు చాలా వింతంగా ఉందని తెలిపాడు. చిరు పోస్ట్ ట్విట్ లో.. ‘రాంచరణ్ కు సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.  అయితే ఈ occasion సందర్భంగా రామ్ చరణ్  పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా చరణ్ నన్ను గర్వపడేలా చేశాడు. చరణే నా ఆనందం. హ్యపీ బర్త్ డే రామ్ చరణ్’ అని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు,  ఫ్యాన్స్ కూడా చెర్రీపై చిరుకున్న  ప్రేమకు సంతోషపడుతున్నారు. రామ్ చరణ్, చిరంజీవి కలిసి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా