బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో పుష్పరాజ్? నిజమైతే బాక్సీఫీస్ షేకే!

By Asianet News  |  First Published Feb 13, 2023, 1:27 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప  : ది రూల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ సినిమాలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఏర్పడింది. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా  సెన్సేషన్ క్రియేట్ చేశారు. సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ లోనూ బన్నీ సత్తా చెప్పారు. పుష్పరాజ్ గా కీర్తి పొందారు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే Pushpa2 ఫస్ట్ షెడ్యూల్ ను వైజాగ్ లో పూర్తి చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లు  వస్తున్నట్టు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా.. ఫ్యూచర్ లో పక్కా అనే అంటున్నారు. ఇక తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆస్టార్ ఎవరో కాదు.. కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చిత్రంలోనే క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 

Latest Videos

చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ‘పఠాన్’తో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఈ  క్రమంలో షారుఖ్ నెక్ట్స్ సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబోలో తదుపరి రిలీజ్ కు సిద్ధం అవుతున్న చిత్రం ‘జవాన్’ (Jawan). ఇప్పటికే చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

అయితే.. చిత్రంలో హీరోయిన్  నయన తార, విజయ్ సేతుపతి, ప్రియమణి, తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్నట్టు ప్రచారం. ఇంత సౌత్ స్టార్స్ తో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ గట్టిగా బజ్ క్రియేట్ అవుతోంది. ఇది నిజమే అయితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే అంటున్నారు. జూన్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ రిలీజ్ కాబోతోందీ చిత్రం. 

click me!