సైరా: భయంకర బ్రిటిష్ కింగ్స్.. లండన్ నుంచి వచ్చారట!

By Prashanth MFirst Published Sep 25, 2019, 12:29 PM IST
Highlights

సురేందర్ రెడ్డిని సైరా సినిమాకు దర్శకుడిగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆయన మేకింగ్ స్టైల్. సినిమా ఎలా ఉన్నా ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడు. మెయిన్ గా విలన్స్ ని మొదటి సీన్ తోనే అతి భయంకరంగా చూపించడం సురేందర్ రెడ్డి ప్రధాన టాలెంట్.

సురేందర్ రెడ్డిని సైరా సినిమాకు దర్శకుడిగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆయన మేకింగ్ స్టైల్. సినిమా ఎలా ఉన్నా ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడు. మెయిన్ గా విలన్స్ ని మొదటి సీన్ తోనే అతి భయంకరంగా చూపించడం సురేందర్ రెడ్డి ప్రధాన టాలెంట్. ఇక సైరాలో కూడా తన యాంగిల్ లో బ్రిటిష్ రాజులను అతి బయంకరంగా చూపించబోతున్నాడు. 

అయితే సినిమాలో 7 ముఖ్యమైన పాత్రల కోసం లండన్ లో ఆడిషన్స్ నిర్వహించారట. షూటింగ్ మొదలయ్యో 30రోజుల ముందు 100మందితో ఆడిషన్స్ చేసి ప్రముఖ పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంగ్లిష్ యాక్టర్స్ ని సైరా లో సరికొత్తగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ పాలకులకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే గత సినిమాల్లో ఉన్నట్లు కాకుండా సురేందర్ తన సొంత ఫార్మాట్ లో విలన్స్ ని తెరపై చూపించాడట. 

ఇక క్లయిమ్యాక్స్ సీన్స్ లో వారి విలనిజం డోస్ మరింత భయంకరంగా ఉండనుందని సమాచారం. ఆడియెన్స్ లో ఎక్కువగా క్లయిమ్యాక్స్ సీన్ ఆకర్షిస్తోంది. ఆ సీన్ ని ఎలా తెరకెక్కించారు అనేది ప్రతి ఒక్కరిలో హాట్ టాపిక్ గా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఎలా ఉరి తీశారు. అలాగే కోట గుమ్మానికి 30 ఏళ్లపాటు తలను వ్రేలాడదీసిన సీన్ ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

click me!