RRR: వావ్.. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published : Oct 31, 2018, 03:12 PM IST
RRR: వావ్.. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్!

సారాంశం

టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటినుంచి అందరి చూపు ఎక్కువగా దర్శకదీరుడు రాజమౌళి తీయబోయే RRR పైనే ఉంటుంది రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బారి మల్టీస్టారర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవ్వనుంది.

టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటినుంచి అందరి చూపు ఎక్కువగా దర్శకదీరుడు రాజమౌళి తీయబోయే RRR పైనే ఉంటుంది రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బారి మల్టీస్టారర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవ్వనుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బారి స్థాయిలో ఒక సౌత్ మల్టీస్టారర్ ను డివివి.దానయ్య నిర్మిస్తున్నారు. 

ఇకపోతే సినిమాకు సంబందించిన అప్డేట్స్ రోజురోజుకి అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. అసలు విషయానికి వస్తే సినిమా కథ గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం  కథ 1920 కాలాన్ని బేస్ చేసుకొని ఉంటుందట. ఆ కాలం నాటి వాతావరణం తెరపై కరెక్ట్ గా కనిపించడానికి రాజమౌళి టీమ్ గత కొంత కాలంగా అనేక వర్క్ షాప్స్ ని నిర్వహించింది. 

ఇక హైదరాబాద్ నగర  అంచుల్లో గండిపేట వద్ద కొన్ని స్పెషల్ సెట్స్ ను మొదటి షెడ్యూల్ కోసం సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆ పనులన్నీఎండింగ్ కి వచ్చేశాయి. ఇక నవంబర్ రెండవరంలో సినిమా లాంచింగ్ కార్యక్రమాలతో మొదలుకానున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?