టీవీకి గుడ్‌ బై చెప్పిన క్రేజీ బ్యూటీ నవ్యస్వామి.. `ఇంటింటి రామాయణం`తో హీరోయిన్‌గా పరిచయం

By Asianet News  |  First Published Mar 10, 2023, 7:23 PM IST

సీరియల్ యాక్ట్రెస్ గా టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన నవ్య స్వామి (Navya Swamy) ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ‘ఇంటింటి రామాయణం’తో అలరించబోతోంది. 
 


యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నవ్య స్వామి సీరియల్ యాక్ట్రెస్ గా అందరికీ సుపరిచితమే. కన్నడకు చెందిన ఈ బ్యూటీ మోడల్ గా కేరీర్ ను ప్రారంభించింది. కన్నడ సీరియల్ ‘తంగలి’లో అవకాశం అందుకుని ఫీమేల్ లీడ్ లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. మరోవైపు తెలుగులో టెలివిజన్ ప్రొడక్షన్స్ లోనూ ఆఫర్స్ అందుకుంది. భార్యామణి, తలంబ్రాలు, నాపేరు మీనాక్షి, కంటే కూతురినే కనాలి, వాణి రాణి, వినోద భోజనంబు వంటి సీరియల్స్ తో టీవీ ప్రేక్షకుకులకు బాగా దగ్గరైంది. అలాగే టీవీ షోలలోనూ మెరిసింది. క్యాష్,  డీ14, ఆయా  స్పెషల్ ఈవెంట్లతో ఆకట్టుకుంటూనే ఉంది.

ప్రస్తుతం నవ్య స్వామికి తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుతుండటం ఆసక్తికరంగా మారింది.  వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది.  రీసెంట్ గా ‘బుట్టబొమ్మ’ చిత్రంలో కీలక పాత్రలో అలరించింది. ఈ చిత్రం ప్రమోషన్స్ లోనూ ఆకట్టుకుంది. తాజాగా ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam) చిత్రంలో హీరోయిన్ గా అవకాశం  అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.  తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో నవ్య స్వామి కూడా మాట్లాడారు. అదే సమయంలో టెలివిజన్ పైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Latest Videos

నటి నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కల నిజమైన సమయం ఇది. టెలివిజన్ లో చేస్తున్నప్పుడు సినిమాలు చేయాలి అనుకునేదానిని. ఇక టెలివిజన్ లో చేసింది చాలు.. సినిమాలు చేద్దాం అనుకున్న సమయంలో ‘ఇంటింటి రామాయణం’ అవకాశం వచ్చింది. ఇంతమంచి సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. టెలివిజన్ ఒక మారథాన్ లా నిరంతరం కొనసాగతూనే ఉంటుంది. ఇక సినిమాల్లో నటించాలని అనుకున్నానంటూ వ్యాఖ్యానించింది. దీంతో మున్ముందు టీవీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు  తెలుపుతుందని అర్థం అవుతోంది. 

ఇక హీరోయిన్ అవకాశం ఇచ్చిన నాగవంశీ, మారుతికి కృతఙ్ఞతలు. నన్ను నమ్మినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. లెజెండరీ యాక్టర్ నరేష్ తో కలిసి నటించడం గర్వంగా ఉంది. రాహుల్, గంగవ్వ, అంజి అందరితో కలిసి పనిచేయడం సరదాగా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది" అన్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణలోనే ఉన్నారు. కానీ తెలంగాణ యాసలో మాట్లాడటం కాస్తా కష్టమేనంది. ఈ చిత్రంలో పక్కా తెలంగాణ యాసతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోంది.  

సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం 'ఇంటింటి రామాయణం'. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 

click me!