‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సాలిడ్ అప్డేట్ ను అందించారు.
మరోసారి యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తన దర్శకత్వంలో తానే నటించి ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఈ నెలలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇక రిలీజ్ కు పదిరోజుల సమయమే ఉండటంతో విశ్వక్ సేన్ ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా మరో న్యూస్ అందించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ 1.0 కు ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ లో యూత్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. విశ్వక్ సేన్ మరింత అగ్రెసివ్ గా కనిపించడం మాస్ డైలాగ్స్, స్టైలిష్ లుక్, రొమాంటిక్ టచ్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వరుస వస్తున్న అప్డేట్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇదీగాక మరింత డోస్ పెంచబోతున్నట్టు విశ్వక్ సేన్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు అదిరిపోయే అప్డేట్ అందించారు.
మార్చి 12న చిత్రం నుంచి సెకండ్ ట్రైలర్ విడుదల కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కరీంనగర్ లోని మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ 2.0 లాంచ్ కానుందని ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ 1.0ను, సాంగ్స్ ను మంచి హిట్ చేశారని తెలిపారు. ఇక డబుల్ డోసేజ్ కు సమయం అయ్యిందని.. మరిన్ని అంశాలతో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుందీ నిన్ననే ప్రకటించారు. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ కూడా పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. చిత్రాన్ని వన్మయ్ క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్ గా నటిస్తోంది.