నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే'.. క్రేజీ అప్డేట్!

Published : Jul 31, 2019, 08:50 PM IST
నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే'.. క్రేజీ అప్డేట్!

సారాంశం

యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో జోరు పెంచాడు. ఈ ఏడాదే నితిన్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లు.   

తొలిప్రేమ చిత్రంతో మెప్పించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రంగ్ దే అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రాన్ని పనిచేయనున్నారు. 

ఆయనే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాని ప్రకటించారు. రంగ్ దే.. మేక్ లైఫ్ మోర్ కలర్ ఫుల్ అనే కామెంట్ పెట్టి ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?