మంచి, చెడు సిద్ధాంతం.. ఆసక్తికరంగా సుమంత్ కొత్త చిత్రం!

Siva Kodati |  
Published : May 30, 2019, 08:46 PM IST
మంచి, చెడు సిద్ధాంతం.. ఆసక్తికరంగా సుమంత్ కొత్త చిత్రం!

సారాంశం

హీరో సుమంత్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. సుమంత్ నటించిన మళ్ళీరావా చిత్రం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నటించిన సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. 

హీరో సుమంత్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. సుమంత్ నటించిన మళ్ళీరావా చిత్రం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నటించిన సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్టు కొట్టేందుకు సుమంత్ మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్నాడు. తాజాగా సుమంత్ సంతోష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. 

ఈ ప్రపంచంలో మంచివాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు లేరు.. పరిస్థితుల ప్రభావం వల్లే మనుషులు మంచిగా, చెడుగా మారుతుంటారు. ఈ సిద్దాంతం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సంతోష్ తెలిపారు. నాని, నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించిన డీఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

ఇటీవల సుమంత్ ఆసక్తికరమైన కథలు ఎంపిక చేసుకుంటున్నా అవి ఆడియన్స్ కు కనెక్ట్ కావడంలో విఫలం అవుతున్నాయి. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రంతో అయినా సుమంత్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన