కొంత గ్యాప్ తర్వాత హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ‘వాట్ ద ఫిష్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంటోంది.
హీరో మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. చివరిగా ‘ఒక్కడు మిగిలాడు‘ చిత్రంతో అలరించాడు. ఇది 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో క్యామియో అపియరెన్స్ తో అలరించాడు. దాదాపు ఐదేండ్లకు పైగా మనోజ్ సినిమాలేవీ తెరపైకి రాలేదు. మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు.
What the fish అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. రూపాలు మార్చుతూ మంచు మనోజ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ అలరించబోతున్నారని గ్లింప్స్ తో తెలియజేశారు.
‘వాట్ ద ఫిష్’ చిత్రాన్ని నిర్మాతలు విశాల్ బెజవాడ - సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వచ్చిన ఫస్ట్ పోస్టర్ ఆసక్తిని పెంచగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్ మరింతగా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచు మనోష్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది.
ఇక మనోజ్ పెళ్లి రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ - భూమా మౌనికా రెడ్డి వివాహం మార్చి 3, 4 తేదీన గ్రాండ్ గా జరిగింది. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా నిర్వహించారు. తండ్రి మోహన్ బాబు కూడా వారిని ఆశీర్వదించారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయిన విషయం తెలిసిందే. ‘వాట్ ద ఫిష్‘ నుంచి రెగ్యులర్ గా చిత్రాలు చేయబోతున్నారని మనోజ్ ఇప్పటికే చెప్పారు.