RC15:'అధికారి' కన్నా ఇదే బెటర్ అంటున్న ఫ్యాన్స్.. రాంచరణ్, శంకర్ మూవీ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్

By team teluguFirst Published Jun 26, 2022, 2:06 PM IST
Highlights

ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. సందేశంతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉండబోతోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో నార్త్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ పోషించిన రామరాజు పాత్ర నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ తన తండ్రి చిత్రం ఆచార్యలో కీలక పాత్రలో నటించాడు. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.   

సందేశంతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉండబోతోంది. రాంచరణ్ ఈ మూవీలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. విభిన్న గెటప్స్ లో చరణ్ పాత్ర ఉండబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ టైటిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. 

రాంచరణ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తుండడంతో ముందుగా 'అధికారి' అనే టైటిల్ పరిశీలించారు. కానీ ఆ టైటిల్ గురించి బజ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి కరమైన రెస్పాన్స్ రాలేదు. ఏదో ఓల్డ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. 

ఇప్పుడు సరికొత్తగా మరో టైటిల్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ కాగానే ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అధికారి కంటే ఇదే బెటర్ అని అంటున్నారు. మరి శంకర్ దీనినైనా ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 50 వ చిత్రం ఇది. కియారా అద్వానీ రాంచరణ్ కి హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. 

click me!