ఇక తేల్చాల్సింది విజయ్,నాగ చైతన్యలే!

Published : Jul 22, 2022, 01:24 AM ISTUpdated : Jul 22, 2022, 12:29 PM IST
ఇక తేల్చాల్సింది విజయ్,నాగ చైతన్యలే!

సారాంశం

టూ టైర్ హీరోల చిత్రాలు ప్రేక్షకులు థియేటర్ లో చూడడానికి ఇష్టపడటం లేదనే ఓ భావన తెరపైకి వచ్చింది. ఇటీవల విడుదలైన టూ టైర్ హీరోల సినిమాల రిజల్ట్ దానికి నిదర్శనం.

 

ఓటీటీ ఫాట్ ఫార్మ్స్   సమీకరణాలు మొత్తం మార్చేశాయి. ఒకప్పడు పట్టణాల వరకే విస్తరించిన ఈ కల్చర్ పల్లెలకు కూడా వ్యాపించింది. ఓటీటీ ప్లాంట్ ఫార్మ్స్ లో నెలల వ్యవధిలో సినిమాలు విడుదల అవుతున్నాయి. అదే సమయంలో పెరిగిన టికెట్స్ ధరల వలన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మానేశారు. ఒక ఫ్యామిలీ థియేటర్ లో సినిమా చూడాలంటే వెయ్యి రూపాయలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి. 

ఈ నేపథ్యంలో టూ టైర్ హీరోల చిత్రాలు ప్రేక్షకులు థియేటర్ లో చూడడానికి ఇష్టపడటం లేదనే ఓ భావన తెరపైకి వచ్చింది. ఇటీవల విడుదలైన టూ టైర్ హీరోల సినిమాల రిజల్ట్ దానికి నిదర్శనం. నాని నటించిన అంటే సుందరానికీ, గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. ఇక దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీశాయి. ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు అందుకే కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ లో పెట్టానని ఆయన చెప్పారు

కాగా వచ్చే వారం థ్యాంక్ యూ మూవీతో నాగ చైతన్య థియేటర్స్ లో దిగనున్నారు. అలాగే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఆగస్టు లో విడుదల కానుంది. ఈ రేణు చిత్రాలు ఫలితాలపై టూ టైర్ హీరోల భవిష్యత్ ఆధారపడి ఉంది ఉంది . చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఎలా ఆడుతాయో.. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా