
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘లైగర్’. ఈ చిత్రం రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ సక్సెస్ ను అందుకున్న పూరీ.. మార్కెట్ లో మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ కు ఆడియెన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మాస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూ యూట్యూబ్ దద్దరిల్లిపోతోంది. ఊహించని దానికంటే రెట్టింపు రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది లైగర్ టీం.
అయితే, తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ పై ‘విజయ్ స్పీచ్’తో మరింతగా అంచనాలు నెలకొన్నాయి. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ కే ఇంత రచ్చ చేస్తున్నారేంట్రా నాయనా.. మీకు మా అయ్య తెల్వదు, నాన్న తెల్వదు అయినా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికీ లవ్ యూ.. ఇప్పటికే నా సినిమా వచ్చి రెండేండ్లయ్యింది. అవీ చెప్పుకునే సినిమాలేమీ కాదు. ఈ సినిమాను మీకు డెడికేట్ చేస్తున్న.. మూవీలో క్రేజీ ఫైట్స్, కిక్కిచ్చే డాన్స్ తో వందశాతం ఎంటర్ టైన్ అందిస్తాం. ఆగస్టు 25న ఇండియాను షేక్ చేస్తాం. థియేటర్లతో నింపేయండి’ అంటూ ఎనర్జిటిక్ గా మాట్లాడారు. ఫ్యాన్స్ తో విజయ్ ఎమోషనల్ గా మాట్లాడటం నెట్టింట వైరల్ అవుతోంది.
‘లైగర్’ కోసం ఇప్పటికే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. Liger టీం ఇప్పటికే అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తోంది. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. ట్రైలర్ ను తెలుగుతో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేయగా.. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. సిక్స్ ప్యాక్ తో, ఎనర్జిటిక్ డైలాగ్స్ తో విజయ్ ట్రైలర్ లో చేసిన రచ్చకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఈ మూవీ తర్వాత విజయ్ పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ కూడా దక్కింది.
మూవీలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) హీరోహీరోయిన్లుగా నటించారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు లైగర్ ను సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా వ్యవహరించారు. రమ్యక్రిష్ణ, రోనిత్ రాయ్, మైక్ టైసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.