
సినీ పరిశ్రమ ఏదైనా కొన్ని సెంటిమెంట్స్ ,లెక్కలతో నడుస్తూంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు,భారీ బడ్జెట్ సినిమాలు ప్రారంభాలు, రిలీజ్ లు అప్పుడు ఈ సెంటిమెంట్స్ బాగా ప్రాధాన్యత వహిస్తాయి. ఆచి,తూచి ముహూర్తం పెట్టి మరీ ట్రైలర్స్ రిలీజ్ చేయటం, హిట్ సినిమాల డేట్ చూసి మరీ తమ సినిమాని అదే రోజు రిలీజ్ కు పెట్టుకోవటం చేస్తూంటారు. అద్ కేరమంలో తెలుగు సినీ పరిశ్రమలో ఏప్రిల్ 28కి ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే... భారతీయ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన 'బాహుబలి 2' విడుదలైనది ఆ రోజే. అంతే కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' విడుదలైనదీ ఆ రోజే.
అందుకాదు కొన్నేళ్ళ ముందుకు వెళితే... నందమూరి తారక రామారావు 'అడవి రాముడు'తో ఆంధ్రులను ఆలరించినదీ ఆ రోజే. ఏప్రిల్ 28న విడుదలైన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ బరిలో చరిత్ర సృష్టించాయి. భారీ అంటే భారీ విజయాలు నమోదు చేశాయి. ఇప్పుడు ఆ తేదీ మీద అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కర్చీఫ్ వేసి ముందుకు దూకారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'ఏజెంట్' (Agent Movie Release Date). ఏప్రిల్ 28న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
దాంతో 'ఏజెంట్' మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది? ప్రభాస్ 'బాహుబలి 2', మహేష్ 'పోకిరి' మేజిక్ రిపీట్ అవుతుందా? ఇండస్ట్రీ హిట్ డేట్ మీద కన్నేసిన అఖిల్, ఎటువంటి రిజల్ట్ అందుకోబోతున్నారు? అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. అలాగే అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ ఐకానిక్ డేట్.. సెంటిమెంట్ గురించి నిర్మాత అనిల్ సుంకర ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ కు కారణమైంది. అఖిల్ ఏజెంట్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఏజెంట్ మూవీ ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ రాబట్టగా రెండో రోజు మాత్రం కోటి యాభై లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు,మూడో రోజు అయిన ఆదివారం పరిస్దితి కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు.ఏదైమైనా సినిమాలో విషయం లేకుండా ఎంత మంచి డేట్ కి ఎంత మంచి సెంటిమెంట్ తో రిలీజ్ చేసినా వేస్ట్ అని తేలిపోయింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 కోట్ల కలెక్షన్స్ రావాలి. రెండో రోజు 80 లక్షల కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా డిజాస్టర్ పక్కా అని తేలిపోయింది. ఈ సినిమాతోఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలోనే నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.