సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం..నేటి నుంచే అమలు..

By Aithagoni RajuFirst Published Jan 31, 2021, 7:43 AM IST
Highlights

చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్రం. థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది నేడు(ఆదివారం) నుంచి అమల్లోకి రానుండటం విశేషం. కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసింది.

చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్రం. థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది నేడు(ఆదివారం) నుంచి అమల్లోకి రానుండటం విశేషం. కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసింది. గతేడాది మార్చి చివరి వారంలో థియేటర్లు పూర్తిగా మూసేశారు. అనంతరం నవంబర్‌ నెలలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్‌ చేసుకోవచ్చని కేంద్రం నిర్ణయించింది. 

ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్‌ కానున్నాయి. దాదాపు పది నెలల తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ కావడం విశేషం. అయితే కేంద్రం వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూనే కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపింది. ప్రేక్షకులు, సిబ్బంది సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకుల నుంచి ఫోన్ నంబర్లను తప్పనిసరిగా తీసుకోవాలిని సూచించింది.

సినిమా ప్రారంభానికి ముందు, సినిమా చివరలో కోవిడ్‌ భద్రతా నిబంధనలు పాటించకపోతే విధించే శిక్షలను ప్రసారంచేస్తారు. ప్రేక్షకునికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే థియేటర్‌లోకి అనుమతించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లు కూడా డిజిటల్‌ చెల్లింపులను అనుమతించాల్సి ఉంటుంది. మరోవైపు టికెట్‌ కౌంటర్లని తరచుగా శానిటైజేషన్‌ చేయాలని కేంద్రం తెలిపింది.

click me!