నువ్వు ఎవరి బెడ్ లో పడుకుంటున్నావో తెలుసు.. శ్రీహాన్ పై ఇనయ సెన్సేషనల్ కామెంట్స్

By team teluguFirst Published Nov 2, 2022, 11:10 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్ 60లో ఒక ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ పాజిబుల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులు రెడ్ టీం అండ్ బ్లూ టీం గా పాల్గొంటారు.

బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్ 60లో ఒక ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ పాజిబుల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులు రెడ్ టీం అండ్ బ్లూ టీం గా పాల్గొంటారు. ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం సభ్యులు, బ్లూ టీం సభ్యులు రెండు వాల్స్ పై నిలబడతారు. 

వారికి ఇచ్చిన కర్రలు లాంటి ఆయుధాలతో నిబంధనలు పాటిస్తూ పోరాడాల్సి ఉంటుంది. వాల్ నుంచి కింద పడిపోతే వారు అవుట్. చివరికి వాల్ పై ఏ టీం సభ్యులు ఉంటే ఆ టీం విజయం సాధించినట్లు. నేడు నిర్వహించిన రౌండ్ లో రెడ్ టీం విజయం సాధిస్తుంది. రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా , శ్రీహన్ పోటీలో పాల్గొన్నారు. బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయ పాల్గొన్నారు. 

ఈ గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య చెలరేగిన వివాదం పెద్ద గొడవగా మారింది. నామినేషన్స్ తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ అంటూ శ్రీహన్ ఇనయని ఉద్దేశించి అంటాడు. దీనితో ఇనయ కూడా నువ్వు ఎవరి బెడ్ పై పడుకుంటున్నావో తెలుసు అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. గేమ్ పూర్తయిన తర్వాత ఇనయని శ్రీహాన్ కోపంతో అడుగుతాడు. 

ఆ మాటల ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తాడు. శ్రీహాన్, శ్రీసత్య రిలేషన్ పై ఇనయ పరోక్షంగా ఆ కామెంట్స్ చేసింది. దీనితో శ్రీసత్య కూడా ఇనయపై ఆగ్రహంతో చెలరేగిపోతుంది. ఇనయ నోట్లో అశుద్ధం పెట్టుకుని మాట్లాడుతోంది అంటూ శ్రీహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక చివర్లో బిగ్ బాస్ ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆదిరెడ్డికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాలి. అవసరం అయితే మీ సభ్యుల సాయం తీసుకోవచ్చు. ఈ టాస్క్ అనుమానం రాకుండా విజయవంతంగా చేస్తే మీ టీంలో మరణించిన ఒక సభ్యుడిని బతికించే ఛాన్స్ ఉంటుంది అని చెబుతారు. దీనితో నేటి ఎపిసోడ్ ముగిసింది. 

click me!