
లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి రాజకీయాల్లో కూడా ఉంది. ఆమె ఆ మద్యన బిజెపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కరాటే కళ్యాణి స్పందిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఐటెం సాంగ్ తరహాలో అశ్లీలంగా సాగే ఈ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ఈ వీడియో దేవిశ్రీ ప్రసాద్ హాట్ హాట్ గా ఉండే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తుండగా హరే రామ హరే కృష్ణ అనే లిరిక్స్ వస్తాయి. ఐటెం సాంగ్ లాంటి అశ్లీల పాటలో శ్రీకృష్ణుడి మంత్రిని పెట్టడం హిందువులని అవమానించడమే అని కరాటే కళ్యాణి ఫైర్ అవుతున్నారు.
అంతే కాదు హిందూ వాదులతో కలసి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. హరే రామ అనే లిరిక్స్ పాట నుంచి తొలగించాలి అని లేకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఆఫీస్ ని ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నారు. దీనిపై దేవిశ్రీ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ఈ వీడియో 20 మిలియన్ల వ్యూస్ సాధించింది.