అర్థరాత్రి ఒకే బెడ్‌లో రాజ్‌, ఇనయ.. రేవంత్‌తో ఆ పని చేయించుకున్న లేడీ కంటెస్టెంట్.. హౌజ్‌లో రొమాంటిక్‌ యాంగిల్

Published : Sep 29, 2022, 12:03 AM ISTUpdated : Sep 29, 2022, 12:05 AM IST
అర్థరాత్రి ఒకే బెడ్‌లో రాజ్‌, ఇనయ.. రేవంత్‌తో ఆ పని చేయించుకున్న లేడీ కంటెస్టెంట్.. హౌజ్‌లో రొమాంటిక్‌ యాంగిల్

సారాంశం

ఓ వైపు ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా, అర్థరాత్రి సమయంలో హౌజ్‌మేట్స్ రెచ్చిపోయారు. రాజ్‌, ఇనయ ఒకే బెడ్‌పై గుసగుసలు పెట్టుకోవడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 6 నాల్గో వారం బుధవారం(24వ రోజు) ఎపిసోడ్‌లో  కెప్టెన్సీ టాస్క్ కొనసాగింది. హోటల్‌ వర్సెస్‌ హోటల్‌ టాస్క్ లో హోటల్‌ స్టాఫ్‌ తమ సర్వీస్‌ ద్వారా గెస్ట్ ల నుంచి మనీ సంపాదించాల్సి ఉంటుంది. మొదటి రోజు ఆటలో బీబీ హోటల్‌ స్టాఫ్‌ కంటే గ్లామ్ రెస్టారెంట్‌ స్టాఫ్‌ వద్ద ఎక్కువ మనీ ఉండటంతో వాళ్లు విన్నర్స్‌ అయ్యారు. దీంతో బీబీ హోటల్‌ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. 

అయితే ఇందులో చంటికి బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ టాస్క్ ఇవ్వగా, దాన్ని నిర్వర్తించడంలో చంటి పూర్తిగా విఫలం కావడంతో ఆయన్ని ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల జాబితా నుంచి తొలగించారు బిగ్‌బాస్‌. అదేసమయంలో విన్నర్‌గా నిలిచిన గ్లామ్‌ రెస్టారెంట్‌ స్టాఫ్ ..బీబీ హోటల్‌ లో నుంచి ఇద్దరిని కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తొలగించే అవకాశం ఉంది. దీంతో అయిదుగురు అమ్మాయిలు ఫైమా, శ్రీ సత్య, వసంతి, ఆరోహి, కీర్తి కలిసి దీనిపైనిర్ణయం తీసుకుని తమకు స్ట్రాంగ్‌ ప్లేయర్‌గా భావించిన రేవంత్‌, బాలాదిత్యలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించారు. 

ఓ వైపు ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా, అర్థరాత్రి సమయంలో హౌజ్‌మేట్స్ రెచ్చిపోయారు. రాజ్‌, ఇనయ ఒకే బెడ్‌పై గుసగుసలు పెట్టుకోవడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. బెడ్‌పై  దుప్పటి కప్పుకుని పడుకోగా, ఆయనతో టాస్క్ గురించి ముచ్చటించింది ఇనయ. అంతేకాదు ఏకంగా ఆయనపై కాసేపు పడుకుంది ఇనయ. ఇది మరింత హీటెక్కిస్తుంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటపెట్టి షోని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. మరోవైపు రేవంత్‌ చేత కాళ్లు పట్టించుకుంది ఇనయ. రాత్రి సమయంలో సీక్రెట్‌గా వీరీ పనిచేశారు. అందుకు కొంత అమౌంట్‌ని రేవంత్‌కి ఇచ్చింది ఇనయ. ఇదిప్పుడు ట్రోల్స్ కి గురవుతుంది.

దీంతోపాటు రోహిత్‌, మరీనా కలిసి ఒకే బెడ్‌పై పడుకున్నారు. అయితే రోహిత్‌ వద్ద డబ్బు కొట్టేసేందుకు ఆరోహి తెగ ప్రయత్నించింది. దీనికి మరీనా సపోర్ట్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆమె కూడా తన భర్త రోహిత్‌ని హగ్‌చేసుకుంది. ఇదంతా ఓవైపు నడుస్తుంటే, మరోవైపు శ్రీసత్య, అర్జున్‌ల మధ్య మరో కెమిస్ట్రీ నడుస్తుంది. శ్రీసత్యకి అర్జున్‌ గట్టిగానే ట్రై చేస్తున్నాడని అర్థమవుతుంది. శ్రీ సత్య చుట్టూతే తిరుగుతూ కనిపించాడు అర్జున్‌. ఆమెతోనే ముచ్చటిస్తూ పులిహోర గట్టిగానే కలుపుతున్నాడు. శ్రీసత్య సైతం ఏమీ తెలియనట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఇక్కడ హైలైట్‌గా నిలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌