చివరి దశలో ‘దాస్ కా దమ్కీ’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..

Published : Jul 10, 2022, 01:44 PM IST
చివరి దశలో ‘దాస్ కా దమ్కీ’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..

సారాంశం

మాస్ కా దాస్, విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో అలరించిన యంగ్ హీరో తాజాగా ‘దాస్ కా దమ్కీ’తో మరోసారి సందడి అలరించనున్నాడు.  

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అతి తక్కువ హీరోల్లో విశ్వక్ సేన్  (Vishwak Sen) ఒకరు. ‘వెల్లిపోమాకే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన విశ్వక్.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అభిమానులను ఫిదా చేస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల రొమాంటిక్ ఫిల్మ్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మరో ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు విశ్వక్. వాటిలోంచి ‘దాస్ కా దమ్కీ’ (Das Ka Dhamki) మూవీ నుంచి విశ్వక్ సేన్ క్రేజీ అప్డేట్ ను అందించారు.

తమిళ చిత్రం ‘మనకథ’ను తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమే ‘దాస్ కా దమ్కీ’. ఈ మూవీలో విశ్వక్  సేన్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మూవీలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ (Nivetha Peturaj) నటిస్తోంది. ఇప్పటికే ‘పాగల్’ చిత్రంలో వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మరోసారి ఈ పేయిర్ లో సినిమా వస్తుండటం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన  చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. 

తాజాగా సినిమా షూటింగ్ పై విశ్వక్ క్రేజీ అప్డేట్ ను అందించారు. చిత్రం చివరి దశలో ఉందని, ప్రస్తుతం నాల్గో షెడ్యూల్ పూర్తి చేసుకున్నామని, మరో షెడ్యూల్ ను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రపంచానికి చూపించడానికి మరింత స్పీడ్ గా వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో  త్వరలోనే ‘మాస్ కా దాస్’ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నట్టు అర్థమవుతోంది.  ఇటు ఫ్యాన్స్ కూడా ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ చిత్రాన్ని వాన్ మాయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ పతాకంపై రూపొందిస్తున్నారు. తొలుత దర్శకుడు నరేష్ లీ అనే దర్శకుడు సినిమాను డైరెక్ట్ చేసేందుకు ఎంపికైనా.. ఆ తర్వాత మాత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా విశ్వక్ సేనే చూస్తున్నట్టు సమాచారం. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ బాబు ఎంపికయ్యారు. త్వరలోనే చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే.. విశ్వక్ మరో నాలుగు చిత్రాలు ‘గామి’,‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’, ‘ఓరీ దేవుడా’, ‘ముఖచిత్రం’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

 

PREV
click me!

Recommended Stories

Superhero Film: పుష్ప విలన్ కి ఛాన్స్, సమంత అవుట్ ? స్టార్ హీరో సినిమాలపై క్రేజీ అప్డేట్స్
Malaika Arora: వయసు 52 ఏళ్ళు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా.. మలైకా దెబ్బకు సోషల్ మీడియా షేక్