ముప్పై ఏళ్ల క్రితమే అమితాబ్ కంటే ఎక్కువ తీసుకున్న చిరు.. ఎంతంటే?

Published : Aug 22, 2023, 08:15 PM IST
ముప్పై ఏళ్ల క్రితమే అమితాబ్ కంటే ఎక్కువ తీసుకున్న చిరు.. ఎంతంటే?

సారాంశం

నేడు చిరంజీవి బర్త్ డే కాగా ఆయన ఘన చరిత్ర చిత్ర పరిశ్రమ గుర్తు చేసుకుంటుంది.  మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించాడు.   

ఓ పదేళ్ల క్రితం వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా మార్కెట్ లేదు. మన చిత్రాలు బయట పరిశ్రమల్లో ఆడవు. కానీ చిరంజీవి లాంటి స్టార్స్ మాత్రం బాలీవుడ్ మీద ఆధిపత్యం సాధించారు. చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉండగా స్ట్రెయిట్ హిందీ చిత్రాలు చేశారు. ఇక బాహుబలి అనంతరం ప్రభాస్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరో అయ్యారు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. అయితే మూడు దశాబ్దాల క్రితమే చిరంజీవి ఈ ఫీట్ సాధించాడు. 

1992లో వరుస విజయాలతో ఊపుమీదున్న చిరంజీవి కోసం నిర్మాతలు ఎగబడ్డారు. ఆయన కోరుకున్నంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు క్యూలు కట్టారు. అప్పుడు చిరంజీవి రూ. 1.25 కోట్లు తీసుకున్నాడని ది వీక్ అనే నేషనల్ మ్యాగజైన్ ప్రచురించింది. కవర్ పేజీ పై చిరంజీవి ఫోటో వేసి బిగ్గర్ దెన్ అమితాబ్ అని హెడ్డింగ్ పెట్టారు. అమితాబ్ కంటే చిరంజీవి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఆ కథనం సారాంశం. 

ఒక ప్రాంతీయ చిత్రాల హీరో నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న సూపర్ స్టార్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడని హైలెట్ చేశారు. చిరంజీవి హీరోగా నమోదు చేసిన ఇలాంటి అరుదైన రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే దశాబ్దాల పాటు ఆయన నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఇక ఏడు పదుల వయసు దగ్గర పడినా కూడా వరుస చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి ఏడాది కాలంలో ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అనే నాలుగు చిత్రాలు విడుదల చేయడం విశేషం. నేడు జన్మదినం పురస్కరించుకుని మరో రెండు చిత్రాలు ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు