ఒక్కసారిగా ఇలియానా కొడుకు సెన్సేషన్ అయిపోయాడుగా.. క్రేజీ వీడియో వైరల్

Published : Jun 08, 2024, 09:29 AM IST
ఒక్కసారిగా ఇలియానా కొడుకు సెన్సేషన్ అయిపోయాడుగా.. క్రేజీ వీడియో వైరల్

సారాంశం

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది.

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సునామి సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలసి ఆడిపాడింది. 

కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారాలు వాటి ఫలితంగా ఎదురైనా ఇబ్బందులతో ఇలియానా సతమతమయింది. డిప్రెషన్ నుంచి తిరిగి కోలుకున్న ఇలియానా సీక్రెట్ గా ఫారెన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించే వరకు ఇలియానా పెళ్లి చేసుకుందా అని ఎవరికీ తెలియదు. 

ఇలియానా గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఇలియానా తన భర్త, కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టింది. తరచుగా ఇలియానా తన కొడుకు క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. 

 

ఇప్పుడు ఏకంగా వీడియో క్యూట్ గా మురిపిస్తున్న వీడియో పోస్ట్ చేసేసింది. ఈ వీడియోలో ఇలియానా కొడుకు ముద్దులొలికించే విధంగా ఉన్నాడు. అల్లరి చేస్తూ జలకాలాడుతూ ఉన్నాడు. సెలబ్రిటీలు సైతం ఇలియానా కొడుకు క్యూట్ నెస్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోతో ఇలియానా కొడుకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా