హృదయం బద్దలయ్యేలా చేసిన బ్రేకప్.. ఇక పెళ్ళికి రెడీ అంటున్న ఇలియానా, చిన్న పిల్లలా ఏడుస్తూ..

pratap reddy   | Asianet News
Published : Nov 01, 2021, 09:35 AM IST
హృదయం బద్దలయ్యేలా చేసిన బ్రేకప్.. ఇక పెళ్ళికి రెడీ అంటున్న ఇలియానా, చిన్న పిల్లలా ఏడుస్తూ..

సారాంశం

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. Pokiri తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. Pokiri తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

పోకిరి తర్వాత చాలా కాలం పాటు కుర్రాళ్లు Ileana జపమే చేశారు. ఎక్కడ చూసినా ఇలియానా మానియా కనిపించేది. అంతలా ఇలియానా తన నాజూకు అందాలతో వెండితెరని హీటెక్కించింది. టాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్న సమయంలో బాలీవుడ్ ని కూడా ఏలేయాలనే బయలుదేరింది. కానీ అక్కడ ఇలియానా అంతగా ఎవరూ పట్టించుకోలేదు. అరకొర సినిమాలు మాత్రమే వచ్చాయి. 

ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ తో ప్రేమ, సహజీవనం లాంటి వ్యవహారాలు నడిపింది. కానీ ఊహించని విధంగా అతడితో బ్రేకప్ చేసుకుంది. దీనితో చాలా కాలం పాటు ఇలియానా డిప్రెషన్ లో ఉన్నట్లు గతంలో తెలిపింది. హృదయం బద్దలయ్యేలా చేసిన బ్రేకప్ వేదన నుంచి కొంతకాలానికి బయట పడింది ఇలియానా. 

ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఏడవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఇలియానా ఎందుకు ఏడవాల్సి వచ్చిందంటే.. కూరగాయలు తరుగుతుంటే పొరపాటున చేతి వేళ్ళు తెగాయట. కత్తి పదునుగా ఉండడంతో పెద్ద గాయమే అయినట్లు ఇలియానా తెలిపింది. దీనితో చిన్నపిల్లలా ఏడ్చేశానని ఈ నడుము సుందరి చెప్పుకొచ్చింది. 

ఆ ఫోటోని కూడా ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉండగా ఇలియానా తన పెళ్లి గురించి కూడా ఓపెన్ అయింది. ఇటీవల పెళ్ళెప్పుడు అని ఇలియానాకు ప్రశ్న ఎదురైంది. త్వరగానే పెళ్లి చేసుకోవాలని నాక్కూడా ఉంది. కానీ వరుడు దొరకడం లేదు అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇలియానా చివరగా తెలుగులో Ravi Teja సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే