నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

Published : Sep 16, 2019, 10:23 AM IST
నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

సారాంశం

తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా.   

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా బాలీవుడ్ లో అవకాశాలు లేక తిరిగి టాలీవుడ్ కి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా ఆమె తన బాయ్ ఫ్రెండ్ నుండి విడిపోయిందనేవార్తలు వచ్చాయి.

ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొంతకాలం డేటింగ్ చేసిన ఇలియానా రీసెంట్ గా సోషల్ మీడియాలో అతడి అన్ ఫాలో చేయడంతో పాటు ఇద్దరూ కలిసి  ఉన్న ఫోటోలను తన అకౌంట్ నుండి తొలగించింది.

దీంతో వీరిద్దరూ విడిపోయారనే నిర్ధారణకు వచ్చేశారు ఫ్యాన్స్. పైగా ఇలియానా సోషల్ మీడియాలో సెల్ఫ్ లవ్ కొటేషన్స్ పెట్టడంతో విషయం జనాలకు అర్ధమైంది. ఆమె వేదాంత ధోరణిలో పోస్ట్ లు పెట్టడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె చేసిన ఫన్నీ ట్వీట్ అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది.

''నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో.. ఉండే ఉంటుంది. నా కాళ్లపై కనిపిస్తోన్న గాయాలు, వాటి తాలూకు మచ్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. బహుసా ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తినడానికి అర్ధరాత్రి ట్రిప్ వేశానేమో.. నేనో స్లీప్ వాకింగ్ స్నాకర్ ని'' అంటూ ట్వీట్ చేశారు.

అదే విధంగా.. 'నేనొక మూర్ఖురాలిని' అంటే అర్ధరాత్రి స్నాక్స్ తినే పిచ్చిదాన్ని అంటూ మరో ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన అభిమానులు ఫన్నీ మీమ్స్ తో ఆమెని రిప్లయ్  ఇస్తున్నారు.    

 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు