ప్రియుడితో ఇలియానా బ్రేకప్..?

Published : Aug 26, 2019, 02:03 PM ISTUpdated : Aug 26, 2019, 02:54 PM IST
ప్రియుడితో ఇలియానా బ్రేకప్..?

సారాంశం

ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. పలు మీడియా ఛానెల్స్ వార్తలను ప్రచురించాయి. 

గోవా బ్యూటీ ఇలియానా లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ ఉందనే విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడం, ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం వంటి విషయాలు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి.

గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి 'ఈ ఫోటో తీసిన నా హబ్బీ' అంటూ పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ విషయంపై ఇలియానాని ప్రశ్నించగా.. తనకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నానని.. మేమిద్దరం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నామని చెప్పుకొచ్చింది.

తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే  ఉంచాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు.

దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. పలు మీడియా ఛానెల్స్ వార్తలను ప్రచురించాయి. కొన్నేళ్లుగా కలిసున్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటని కథనాలు ప్రచురిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇలియానా స్పందిస్తుందేమో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?