అవును.. తెలుగు సినిమాలు చాలా రిజెక్ట్ చేశా: ఇలియానా

Published : Nov 14, 2018, 04:01 PM ISTUpdated : Nov 14, 2018, 04:10 PM IST
అవును.. తెలుగు సినిమాలు చాలా రిజెక్ట్ చేశా: ఇలియానా

సారాంశం

దేవదాసు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తన సన్నని నడుముతో చాలా ఏళ్ళు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన అమ్మడు బాలీవుడ్ కి వెళ్లక మళ్ళీ టాలీవుడ్ కి రావడానికి చాలా సమయం తీసుకుంది. 

దేవదాసు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తన సన్నని నడుముతో చాలా ఏళ్ళు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన అమ్మడు బాలీవుడ్ కి వెళ్లక మళ్ళీ టాలీవుడ్ కి రావడానికి చాలా సమయం తీసుకుంది. ఫైనల్ గా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా ద్వారా సరికొత్త రీ ఎంట్రీ ఇచ్చింది. 

గతంలో ఎప్పుడు లేని విధంగా ఫిట్ నెస్ లో మార్పులు తెచ్చి ఛబ్బిగా మారిపోయింది. ఈ నెల 16న రిలీజ్ కానున్న AAA సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ లో అమ్మడు పాల్గొంటోంది. అయితే తనపై వచ్చిన రూమర్స్ కి కూడా ఇల్లి సమాధానం ఇచ్చింది. అప్పట్లో తెలుగు అవకాశాలు వస్తే అస్సలు నటించను అని టాక్ వచ్చినట్లు తెలుసుకున్న ఇలియాన అందుకు వివరణ ఇచ్చింది. 

నేను ఇక్కడ వర్క్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని కొన్ని రూమర్స్ వచ్చాయి,. నిజానికి చాలా సినిమాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అందులో నచ్చక కొన్నిటిని వద్దనుకున్నా మరికొన్ని బావున్నా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లసి వర్క్ చేయలేకపోయాను. నా కెరీర్ ను ఇక్కడే మొదలుపెట్టాను. అలాంటిది నేను తెలుగు ఇండస్ట్రీలో చేయడానికి ఆసక్తి లేదని ఎలా అంటాను అని వివరణ ఇచ్చింది.  

అదే విధంగా తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి చాలా సార్లు ట్రై చేశానని చెబుతూ చివరికి శ్రీను వైట్ల గారు తనపై నమ్మకం ఉంచి తెలుగులో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చారని అందుకు చాలా కృతజ్ఞతలని అమ్మడు వివరించింది.

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్