ఆ కేసు ఇంకా ఉంది.. ఇళయరాజా క్లారిటీ!

By Udayavani DhuliFirst Published Nov 1, 2018, 9:56 AM IST
Highlights

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలను ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ వాడుకోవడంతో అతడు ఫైర్ అయ్యాడు. తన పాటలు ఇతరులు 
వినియోగించకుండా.. స్టే విధించాలని కోరుతూ 2014లో దాఖలు కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసు రద్దు చేశారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలను ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ వాడుకోవడంతో అతడు ఫైర్ అయ్యాడు. తన పాటలు ఇతరులు 
వినియోగించకుండా.. స్టే విధించాలని కోరుతూ 2014లో దాఖలు కేసు దాఖలు చేశారు.

అయితే ఈ కేసు రద్దు చేశారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఇళయరాజా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ''2010లో ఎకో సంస్థ, యాజమాన్యంపై నేను పోలీసులకు సమర్పించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని సీడీలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన తీర్పు ఇటీవల వచ్చింది. ఇందులో న్యాయమూర్తి ఎకో సంస్థపై దాఖలైన క్రిమినల్ చర్యలను మాత్రమే రద్దు చేశారు. నా పాటల కాపీ రైట్స్ కి సంబంధించి ప్రస్తావించలేదు.

అయితే కొందరు పనిగట్టుకొని కావాలని ఈ కేసు రద్దు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ కేసు విచారణ తుదితీర్పు కోసం వేచి చూస్తున్న నేపధ్యంలో.. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయొద్దు'' అంటూ కోరారు. 

click me!