Ilaiyaraja Comments: నేను కూడా ప్రేమించాను: ఇళయరాజా

Published : Mar 22, 2022, 02:06 PM ISTUpdated : Mar 22, 2022, 02:07 PM IST
Ilaiyaraja Comments: నేను కూడా ప్రేమించాను: ఇళయరాజా

సారాంశం

కొంత మంది స్టార్ సెలబ్రిటీల ఎక్కువగా మాట్లాడరు కాని సమయానుసారం స్పందిస్తుంటారు. వారి మాట్లాడిన మాటల్లో ఏదో ఒక విశేషం ఉంటుంది. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ ఇళయరాజా కామెంట్స్ కూడా ఇఫ్పుడు వైరల్ అవుతున్నాయి.   

కొంత మంది స్టార్ సెలబ్రిటీల ఎక్కువగా మాట్లాడరు కాని సమయానుసారం స్పందిస్తుంటారు. వారి మాట్లాడిన మాటల్లో ఏదో ఒక విశేషం ఉంటుంది. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ ఇళయరాజా కామెంట్స్ కూడా ఇఫ్పుడు వైరల్ అవుతున్నాయి. 

ఇండస్ట్రీలో చాలా తక్కువగా మాట్లాడే సెలబ్రెటీల్లో ఇళయరాజా ఒకరు. ఆయన చాలాతక్కువగా మాట్లాడుతారు. కాని మాట్లాడితే మటుకు అందరి దృష్టిని ఆకర్శించేలా మాట్లాడుతారు. రీసెంట్ గా ఆయన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందని ఇళయరాజా అన్నారు. 

ఇళయరాజా తాజాగా  సంగీతాన్ని అందించిన సినిమా కాదల్‌ సెయ్‌. ప్రభాకర్‌ మూవీస్‌ పతాకంపై ఘన వినోదన్‌ నిర్మించిన ఈ చిత్రానికి గణేషన్‌ దర్శకత్వం వహించారు. సుభాష్‌, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ సోమవారం టీ. నగర్‌. పెరియార్‌ రోడ్‌లోని ఇళయారాజా స్టూడియోలో జరిగింది.ఇళయరాజా, దర్శకుడు భారతీరాజా, పి. వాసు ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ తానూ ప్రేమించానని అన్నారు. అయితే పూర్తిగా తన ప్రేమ గురించి చెప్పలేదు..అయితే అది పలు విధాలుగా ఉంటుందని అన్నారు ఇళయరాజా. అంతే కాదు  కాదల్‌ సెయి సినిమా బాగుంటుందని, ఈసినిమాను అందరూ ఆదరించాలన్నారు ఇళయరాజా. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌