మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ఇళయరాజా, సీరియస్ గా తీసుకుంటారా?

By Udayavani DhuliFirst Published Nov 29, 2018, 7:36 AM IST
Highlights

ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతజ్ఞాని  ఇళయారాజా మరోసారి తన పాటల రాయల్టీ పై హెచ్చరిక చేసారు. ‘‘నా పాటలు పాడుతూ ఎవరెవరో ఆదాయం పొందుతున్నారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతజ్ఞాని  ఇళయారాజా మరోసారి తన పాటల రాయల్టీ పై హెచ్చరిక చేసారు. ‘‘నా పాటలు పాడుతూ ఎవరెవరో ఆదాయం పొందుతున్నారు. ఆ ఆదాయంలో నాకు వాటా ఇవ్వరా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.  తన పాటలను పాడాలనుకునే  సింగర్స్  ఎవరైనా అనుమతి తీసుకొని, అందుకు తగిన రాయల్టీని చెల్లించిన తర్వాతే పాడాలని తాజాగా విడుదల చేసిన ఒక వీడియో మెసేజ్ లో స్పష్టం చేశారు.

ఆ వీడియోలో... ‘‘నా పాటలను పాడేందుకు, సంగీతం సమకూర్చేందుకు ముందుగా నా ఫర్మిషన్  తీసుకోవాలి. అందుకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం చేయాలి. లేకపోతే లీగర్ యాక్షన్  తప్పదు. . ఇప్పటివరకూ నేను ఐపీఆర్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నాను. కానీ, ఇకపై ఉండను. . నా తరపున రాయల్టీని ఇకపై దక్షిణ భారత సినీ సంగీత కళాకారుల సంఘం వసూలు చేస్తుంది. ఆ హక్కుని వారిని ఇస్తున్నాను. సింగర్స్  కూడా ఇందులోకి వస్తారు. సింగర్స్  నా పాటలు పాడేందుకు నేను అడ్డుచెప్పడం లేదు. మీరు తీసుకుంటున్న డబ్బుకి మాత్రం రాయల్టీ ఇవ్వాలని అడుగుతున్నాను.

అయితే  మీరు ఉచితంగా పాడితే మాత్రం ఎన్ని పాటలైనా  పాడవచ్చు. అందుకు డబ్బులు ఇవ్వనవసరం లేదు. కచేరీలకు డబ్బులు తీసుకుంటున్నారు కదా? అందులో నా పాటలే పాడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. మరి, ఆ డబ్బులో నాకు షేర్ లేదా? పాటే నాదైనప్పుడు షేర్ లేకుండా ఎలా ఉంటుంది?. నా పాటలు పాడడం లీగల్ గా జరగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్  తరాలకు ఇది మార్గదర్శకంగా ఉంటుంది. అందరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి’’ అని ఇళయరాజా పేర్కొన్నారు.

click me!