దర్శన్‌ వివాదంలో నటి రమ్యపై `ఇడియట్‌` హీరోయిన్‌ రక్షిత మతిపోయే కౌంటర్‌.. నెట్టింట రచ్చ

Published : Jul 28, 2025, 04:06 PM IST
darshan, rakshita, ramya

సారాంశం

నటి రమ్య హీరో దర్శన్ పై చేసిన వ్యాఖ్యలకు హీరోయిన్‌ రక్షిత  పరోక్షంగా తిరుగుబాటు చేశారు. మానవత్వం, మానసిక ఆరోగ్యం, దయ గురించి మాట్లాడుతూ, రమ్య పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే కౌంటర్‌ ఇచ్చారు.

DID YOU KNOW ?
ఇడియట్‌తో రక్షిత పాపులర్‌
హీరోయిన్‌ రక్షిత తెలుగులో `ఇడియట్‌` చిత్రంతో పాపుటర్‌ అయ్యింది. ఇందులో రవితేజ సరసన ఆమె హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

కన్నడ హీరో దర్శన్‌.. అభిమాని రేణుకాస్వామిని హత్యకి సంబంధించిన ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.  ప్రస్తుతం దర్శన్‌ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. త్వరలో విచారణకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వివాదం కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతుంది. 

నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్ ట్రోల్స్ 

ఈ వివాదానికి సంబంధించిన నటి రమ్య స్పందన షాక్‌కి గురి చేస్తోంది. దర్శన్‌ అభిమానులను ఉద్దేశించి ఆమె పరోక్షంగా చేసిన కామెంట్స్ రచ్చ అవుతున్నాయి. 

అభిమాని రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్ చేయగా, దీనికి అభిమానులు కౌంటర్లు ఇచ్చారు. ఆమెని రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. 

దర్శన్‌ ఫ్యాన్స్ కి నటి రమ్య కౌంటర్‌

దీనిపై రమ్య స్పందించారు. "డి బాస్ అభిమానులందరికీ నా ఇన్‌స్టాగ్రామ్‌కు స్వాగతం. రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి అనేదానికి మీ వ్యాఖ్యలు నిదర్శనం` అని  అన్నారు.

దీనిపై ఆమె ఇంకా స్పందిస్తూ, 'అవును, మీ వ్యాఖ్యలు మీ పాత్ర గురించి మాట్లాడుతున్నాయి..` అని రాసింది. ఇందులో రమ్య.. దర్శన్ అభిమానులను నేరుగా కౌంటర్‌ చేసినట్టు అయ్యింది. 

తన వ్యాఖ్యలే న్యాయం అవసరాన్ని సూచిస్తున్నాయని, దర్శన్ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని, అసభ్యకర సందేశాలు పంపిన వారిపై ఫిర్యాదు చేస్తానని కఠినంగా స్పందించారు.

అంతేకాకుండా, బిగ్ బాస్ ఫేమ్ ప్రథమ్‌కు కూడా దర్శన్ అభిమానుల నుండి చెడు అనుభవం ఎదురైంది. ఇటీవల వైరల్ అయిన ఆడియోలో, దర్శన్ అభిమానులు తన ప్రాణాలకు ముప్పు కలిగించారని ప్రథమ్ చెప్పడం ద్వారా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆడియో నిజమేనని ఒప్పుకున్న ప్రథమ్, దర్శన్ అభిమానుల నుండి తనకు ఎదురైన వేధింపులను ఒక్కొక్కటిగా వెల్లడించాడు. 

ప్రథమ్ ఏం చెప్పాడు?

`మీ అభిమానులకు సలహా ఇవ్వండి, రౌడీలను తిండి పెట్టకండి` అని దర్శన్‌కి చెప్పిన ప్రథమ్, `ఇలాంటి పోకిరీలను పోషించే వారిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను` అని అన్నాడు. 

మొత్తం మీద, దర్శన్ పట్ల అభిమానం సరే.. కానీ మీరు నటుడి దుశ్చర్యలను సమర్థించి ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తే,  తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దర్శన్‌ అభిమానులకు సూచించారు. 

నటి రమ్యకి `ఇడియట్‌` హీరోయిన్‌ రక్షిత కౌంటర్‌

ఈ పరిణామాల నేపథ్యంలో దర్శన్ పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలకు `ఇడియట్` హీరోయిన్‌, నిర్మాత రక్షిత ప్రేమ్ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు.

 మానవత్వం, మానసిక ఆరోగ్యం, దయ గురించి మాట్లాడుతూ, రమ్య పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దర్శన్ కి మద్దతుగా నిలిచారు.

 రక్షిత ప్రేమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'నిజంగా వైరల్ కావాల్సింది ఏంటో తెలుసా? కనీస మానవ మర్యాద' అని ఒక పోస్ట్, 'జనాల మానసిక ఆరోగ్యాన్ని చూడలేరు. దయ చూపండి' అని మరో పోస్ట్ పెట్టారు. మానవ మర్యాద, మానసిక ఆరోగ్యం గురించి దయ చూపాలని ఆమె కోరారు. ఇది మరింత రచ్చ లేపుతుంది. 

 

దీనికి దర్శన్ భార్య విజయలక్ష్మి స్పందిస్తూ, కోర్టులో ఉన్న కేసు గురించి రమ్య తొందరపడి మాట్లాడటం సరికాదని, ఆమెపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీనికి దర్శన్ అభిమానులు కూడా మద్దతు తెలిపారు. మరి ఈ వివాదం మున్ముందు ఇంకా ఎటు వైపు టర్స్ తీసుకుంటుందో చూడాలి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు