బన్నీతో `ఐకాన్‌`..క్లారిటీ ఇచ్చిన `వకీల్‌సాబ్‌` డైరెక్టర్‌

Published : Mar 20, 2021, 06:14 PM IST
బన్నీతో `ఐకాన్‌`..క్లారిటీ ఇచ్చిన `వకీల్‌సాబ్‌` డైరెక్టర్‌

సారాంశం

అల్లు అర్జున్‌ హీరోగా `ఐకాన్‌` చిత్రం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపారు. కానీ ఈ సినిమాపై చాలా కాలంగా సస్పెన్స్ నెలకొంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు `వకీల్‌సాబ్‌` దర్శకుడు. 

అల్లు అర్జున్‌ రెండేళ్ల క్రితం `ఐకాన్‌` చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. `ఎంసీఏ` వంటి విజయవంతమైన సినిమాని రూపొందించిన వేణు శ్రీరామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తారని చెప్పారు. దిల్‌రాజు నిర్మించనున్నారు. అయితే బన్నీ `అలావైకుంఠపురములో` సినిమా షూటింగ్‌ టైమ్‌లో తన నెక్ట్స్ చిత్రాలను ప్రకటించారు. సుకుమార్‌తో ఓ సినిమాని ప్రకటించారు. ఆ తర్వాత కొరటాల శివతోనూ మరో సినిమాని అనౌన్స్ చేశాడు బన్నీ. దీంతో వేణు శ్రీరామ్‌ `ఐకాన్‌`పై సందిగ్దం నెలకొంది. 

`ఐకాన్‌` ఉండదనే కామెంట్లు వినిపించాయి. బన్నీ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశాడని వార్తలు చక్కర్లుకొట్టాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ని అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. `ఐకాన్‌` ఉంటుందా? లేదా? అనే దానిపై దర్శకుడు వేణు శ్రీరామ్‌ క్లారిటీ ఇచ్చారు. వేణు శ్రీరామ్‌ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్‌` సినిమాని రూపొందించారు. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

ఇందులో భాగంగా వేణు శ్రీరామ్‌కి `ఐకాన్‌`కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తాను అల్లు అర్జున్‌తో `ఐకాన్‌` సినిమా చేయాల్సి ఉందని చెప్పింది. మరిచిపోయిన ప్రాజెక్ట్ ఉందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం తర్వాత `ఐకాన్‌` ఉంటుందని సమాచారం. మరి అప్పటికైనా ఉంటుందా? లేక ఈ గ్యాప్‌లో లెక్కలు మారిపోతాయా? అన్నది చూడాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?