రామ్‌చరణ్‌ బర్త్ డేకి `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలిసిపోయింది..

Published : Mar 20, 2021, 04:29 PM IST
రామ్‌చరణ్‌ బర్త్ డేకి `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలిసిపోయింది..

సారాంశం

ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తుంది. ఇటీవల ఆలియా బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమెని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

త్వరలో రామ్‌చరణ్‌ బర్త్ డే ఉంది. ఈ నెల 27న ఆయన పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి ఎలాంటి గిఫ్ట్ రాబోతుందనే ఉత్కంఠ, ఆసక్తి `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులు, మెగా అభిమానుల్లో నెలకొంది. తాజాగా దాన్ని రివీల్‌చేసింది యూనిట్‌. బర్త్ డే సందర్భంగా భయంకరమైన అల్లూరి సీతారామరాజు లుక్‌ని విడుదల చేస్తామని తెలిపింది. మరి గత బర్త్ డేసందర్భంగా పోలీస్‌ లుక్‌లో,యుద్ధ యోధుడిగా తన శరీరాన్నిమార్చుకుంటున్న వ్యక్తిగా కనిపించారు చరణ్‌. మరి ఇప్పుడు కొత్త పోస్టర్‌లో ఎంత భయంకరంగా చూపిస్తారో చూడాలి. 

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బర్త్ డే రోజు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా బర్త్ డే సందర్భంగా రానుందట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు