తనలోని మరో యాంగిల్‌ని చూపించిన అల్లు అర్జున్‌.. పవన్‌ని ఫాలో అవుతున్నాడా?

Published : Apr 25, 2021, 03:34 PM IST
తనలోని మరో యాంగిల్‌ని చూపించిన అల్లు అర్జున్‌..  పవన్‌ని ఫాలో అవుతున్నాడా?

సారాంశం

 స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలిచే అల్లు అర్జున్‌ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ తన అభిమానులకు పరిచయం చేశారు. పుస్తకాలు చదవడమనే హ్యాబీని బయటపెట్టారు. 

స్టయిల్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాస్త ఇప్పుడు `ఐకాన్‌ స్టార్‌`గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయనకు దర్శకుడు సుకుమార్‌ `ఐకాన్‌స్టార్‌` అనే ట్యాగ్‌ ఇచ్చాడు. స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలిచే అల్లు అర్జున్‌ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ తన అభిమానులకు పరిచయం చేశారు. పుస్తకాలు చదవడమనే హ్యాబీని బయటపెట్టారు. ఇటీవల ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం చదువుతూ కనిపించారు. 

ఈ ఫోటోని ఆయన భార్య స్నేహారెడ్డి పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటోని బన్నీ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. నెటిజన్లు బన్నీపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మాదిరిగా బన్నీ మారిపోయాడంటున్నారు. పవన్‌ని ఫాలో అవుతున్నాడా అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ జనరల్‌గా పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. ఆయన ఇంటర్వ్యూల్లోనూ, అలాగే తన ఫామ్‌ హౌజ్‌లోనూ చేతిలో పుస్తకాలతో కనిపిస్తుంటారు. అంతేకాదు ఇటీవల ఆయన నటించిన `వకీల్‌సాబ్‌` ఫస్ట్ లుక్‌లోనూ పుస్తకం చదువుతూనే కనిపించారు. ఇక స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలిచే బన్నీ పుస్తకం పట్టడం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. తనలోని కొత్త యాంగిల్‌ని బన్నీ చూపించారని చెప్పొచ్చు. 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `ఆర్య`, `ఆర్య2` తర్వాత వీరికాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్ట్ 13న ఈ చిత్ర విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కాబోతుంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయిక. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు