ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజన్ లో పడేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నాడు సరే... నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడు అంటే.. రకరకాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా తమిళ మాస్ స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఐకాన్ స్టార్.
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సషూటింగ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో చాలా జాగ్రత్తగా పుష్ప2 ను ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఫస్ట్ పార్ట్ మూవీ విషయంలో జరిగిన పొరపాట్లు రిపిట్ అవ్వకుండా.. జాగ్రత్త పడుతున్నారు. పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. మైత్రీ బ్యానర్లో నిర్మిస్తున్న ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్తగా నిర్మించిన అల్లు స్టూడియోలో ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని సమాచారం.
సరే ఇదంతా బాగానే ఉంది. మరి అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు. ఆయనతో సినిమా కోసం చాలా మంది దర్శకులు కాచుకుని కూర్చున్నారు. బోయపాటితో బన్నీసినిమా పక్కా అన్నారు. అది పక్కానే కాని నెక్ట్స్ సినిమా అదే అవుతుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే బోయాపాటి రామ్ తో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు. ఇక పుష్ప2 తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతుందని న్యూస్ గట్టిగా వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు మరో దర్శకుడు బన్నీ లిస్ట్ లోకి వచ్చాడు. ఎప్పుడ చేస్తాడో ఏమో తెలియదు కాని.. త్రివిక్రమ్ సినిమాకి ముందుగాగానీ, ఆ తరువాతగాని అట్లీ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీకి అట్లీ కుమార్ కథ చెప్పడం.. ఆయనకు తెగ నచ్చేసి ఒకే చేయడం కూడా అయిపోయాయట. మరి వీరు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తారో చూడాలి మరి.
మరో వైపు అట్లీ కుమార్ షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాతో అట్లీ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన తరువాత అట్లీ.. అల్లు అర్జున్ సినిమాపై దృష్టి పెట్టబోతున్నాడు. అట్లీ బన్నీ సినిమాపై వర్క్ కంప్లీట్ చేసేలోపు.. అటు పుష్ప సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకున్నారట టీమ్. మరి ఇంది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. అల్లు అర్జున్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. దళపతి విజయ్ తో వరుసగా హిట్ సినిమాలు చేశాడు అట్లీ.