బన్నీ తో అల్లావుద్దీన్ చేయాలని ఉంది

Published : Aug 02, 2021, 06:28 PM IST
బన్నీ తో అల్లావుద్దీన్ చేయాలని ఉంది

సారాంశం

బన్నీతో తనకు అల్లావుద్దీన్ లాంటి మూవీ చేయాలని ఉందని తన మనసులోని కోరిక బయటపెట్టాడు. బన్నీకి సైతం యానిమేషన్  పట్ల ఆసక్తి ఉందని, నేను కూడా మంచిగా స్కెచెస్ వేస్తానని మారుతి తెలిపారు.


భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో వచ్చి చేరారు దర్శకుడు మారుతి. ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తుండగా, హీరో గోపి చంద్ తో పక్కా కమర్షియల్ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. 


కాగా మారుతి హీరో బన్నీతో మూవీ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రతిరోజూ పండగే చిత్రం తరువాత ఆయనకు చాలా గ్యాప్ వచ్చింది. దీనికి కారణం ఆయన బన్నీ కోసం ఎదురు చూశారు. బన్నీతో మారుతి చిత్రం దాదాపు కన్ఫర్మ్ అంటూ వార్తలు కూడా రావడం జరిగింది. తన కోసం క్యూలో ఉన్న స్టార్ దర్శకులకు అవకాశం ఇచ్చిన బన్నీ... దర్శకుడు మారుతికి కన్ఫర్మ్మేషన్ ఇవ్వకుండా క్యూలో ఉంచాడు. 


దీనితో మారుతి గోపీచంద్ తో మూవీ ప్రకటించడం జరిగింది. అయితే బన్నీతో తనకు అల్లావుద్దీన్ లాంటి మూవీ చేయాలని ఉందని తన మనసులోని కోరిక బయటపెట్టాడు. బన్నీకి సైతం యానిమేషన్  పట్ల ఆసక్తి ఉందని, నేను కూడా మంచిగా స్కెచెస్ వేస్తానని మారుతి తెలిపారు. ఇక బాల్యంలో థియేటర్స్ ముందు తండ్రి అరటిపళ్ళు వ్యాపారం చేసేవారని, ఖాళీ సమయాలలో అరటి పళ్ళు వ్యాపారం చేస్తూ... ఎదురుగా ఉన్న సినిమా పోస్టర్స్ బొమ్మలు గీసేవాడిని అని మారుతి తెలియజేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?