ఆరోజు షూటింగ్ కి వెళ్లి తప్పు చేశా.. హీరో నరేష్ కామెంట్స్!

Published : Jun 03, 2019, 03:02 PM IST
ఆరోజు షూటింగ్ కి వెళ్లి తప్పు చేశా.. హీరో నరేష్ కామెంట్స్!

సారాంశం

కామెడీ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. 

కామెడీ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 'మహర్షి' సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటించి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తో నరేష్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. 

చాలా కాలంగా హిట్స్ లేని తనకు 'మహర్షి' గుర్తుండిపోయే సక్సెస్ ఇచ్చిందంటూ ఎమోసనల్ అయ్యాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్న సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నరేష్. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఒకే ఒక్కరోజు షూటింగ్ లో నరకం అనుభవించానని చెప్పాడు.

ఆరోజు షూటింగ్ వెళ్లకుండా ఉండాల్సిందని ఇప్పటికీ అనుకుంటానని అన్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేక హాస్పిట లో జాయిన్ అయిన సమయంలో తాను సినిమా షూటింగ్ కి వెళ్లానని, నాన్న పక్కన ఉండకుండా షూటింగ్ కి వెళ్లడం తను చేసిన పెద్ద తప్పు అని, నాన్నకు మరీ అంత సీరియస్ అని తను భావించలేదని అన్నారు.

ఆ సమయంలోనే 'సీమ టపాకాయ్' షూటింగ్ క్లైమాక్స్ జరుగుతోందని, సినిమాలో కీలకనటుడు జయప్రకాశ్ రెడ్డి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు విదేశాలు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారని.. అప్పుడు వాళ్లు మిస్ అయితే మళ్లీ షూటింగ్ ఆలస్యమవుతుందని ఆరోజు షూటింగ్ కి వెళ్లాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు.

నాన్న పరిస్థితి అలా ఉండటంలో బాధగా ఉన్నా.. కామెడీ సీన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తన కెరీర్ లో అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని, నాన్న చనిపోయిన సమయంలో పక్కన లేననే బాధ ఇప్పటికీ తనను వేధిస్తూనే ఉందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?