మహేష్, ఎన్టీఆర్ తో పోటీ.. నాని, విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్!

Siva Kodati |  
Published : Jun 03, 2019, 02:34 PM IST
మహేష్, ఎన్టీఆర్ తో పోటీ.. నాని, విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్!

సారాంశం

టాలీవుడ్ లో కొత్త తరం స్టార్ హీరోలు సిద్ధం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ఎన్ని విజయాలు సాధించినా అతడిని మీడియం రేంజ్ హీరోగానే పరిగణిస్తూ వచ్చారు. ఇక అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో సంచలనం సృష్టించి యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ లో కొత్త తరం స్టార్ హీరోలు సిద్ధం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ఎన్ని విజయాలు సాధించినా అతడిని మీడియం రేంజ్ హీరోగానే పరిగణిస్తూ వచ్చారు. ఇక అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో సంచలనం సృష్టించి యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ చిత్ర పరిశ్రమలో క్రేజ్ శాశ్వతం కాదు. విజయ్ దేవరకొండ తన స్టార్ హోదాని మరో స్థాయికి తీసుకుని వెళతాడో లేదో చూడాలి. 

ఇదిలా ఉండగా నాని, విజయ్ దేవరకొండలతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. స్టార్ హీరోలతో సినిమా చేసే కంటే ఈ హీరోలతో సినిమాలు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. దీనితో నాని, విజయ్ దేవరకొండకు అదిరిపోయే రెమ్యునరేషన్ అందించడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెమ్యునరేషన్ విషయంలో నాని, విజయ్ దేవరకొండ.. మహేష్, ఎన్టీఆర్ తో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. 

కొందరు నిర్మాతలు ఈ ఇద్దరు హీరోలకు 10 నుంచి 15 కోట్ల పారితోషికం అందించడానికి సిద్ధం అవుతున్నారట. ఇక మహేష్, ఎన్టీఆర్ ఒక్కో చిత్రానికి 15నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి హీరోల విజయపరంపర మరి కొన్ని చిత్రాల పాటు ఇలాగే కొనసాగితే టాలీవుడ్ టాప్ లెగ్ హీరోల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇటీవల టాలీవుడ్ లో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి హీరోలుగా ఈ స్థాయికి ఎదిగిన వారు నాని, విజయ్ దేవరకొండ మాత్రమే అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?