ఆ ఇద్దరి ప్రేమలో విజయ్ దేవరకొండ!

Published : Feb 08, 2019, 02:54 PM IST
ఆ ఇద్దరి ప్రేమలో విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో విజయ్ చేతికి గాయమైంది.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో విజయ్ చేతికి గాయమైంది. ఆ ఫోటోని అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయ్.

ఆ ఫోటోని చూసిన ఇద్దరు చిన్నారులు 'విజయ్ కొండకు ఏమైంది..?' అంటూ తమ ముద్దు ముద్దు మాటలతో అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు 'డాక్టర్ దగ్గరకి వెళ్లు విజయ్ దేవరకొండ' అంటూ సలహా కూడా ఇచ్చారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరి పిల్లల తండ్రి ''మీకు తగిలిన దెబ్బలు చూసి మా చిన్నారులు బాధపడుతున్నారు'' అంటూ విజయ్ దేవరకొండని ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన విజయ్.. ''వీరితో ప్రేమలో పడ్డా.. విజయ్ దేవరకొండకి డాక్టర్ అవసరం లేదు. కానీ మీ ఇద్దరినీ కలవాలని అనుకుంటున్నాడు. మీకు కుదురుతుందా..? '' అని అడిగాడు.

దీనికి సదరు నెటిజన్ ''తప్పకుండా మిమ్మల్ని కలిస్తే మా పిల్లలు చాలా ఆనందపడతారు. మేం అమెరికా నుండి శనివారం హైదరాబాద్ కి రాబోతున్నాం'' అని చెప్పగా.. అతడి నెంబర్ కావాలని విజయ్ టీం నెటిజన్ ని కోరింది.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్