గాయంపై రామ్ చరణ్ పోస్ట్!

Published : Apr 04, 2019, 10:17 AM IST
గాయంపై రామ్ చరణ్ పోస్ట్!

సారాంశం

'బాహుబలి' సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

'బాహుబలి' సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కానీ ఇప్పుడు షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా.. రామ్ చరణ్ మడమ భాగంలో గాయమైంది. దీంతో సినిమా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అయితే తన గాయం గురించి రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తను బాగానే ఉన్నానని అభిమానులకు చెప్పాడు. ''RRR షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవసాత్తు కసరత్తు చేస్తుండగా.. నా కాలి మడమ భాగంలో గాయమైంది. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. మరో మూడు వారాలలో షూటింగ్ లో పాల్గొంటాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 
 

PREV
click me!

Recommended Stories

ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు