Latest Videos

Janhvi Kapoor: నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తా, నాది మాత్రం చూపించను!

By Sambi ReddyFirst Published May 24, 2024, 5:54 PM IST
Highlights

దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన బాయ్ ఫ్రెండ్ చెక్ చేస్తాను అన్న జాన్వీ కపూర్, తన ఫోన్ మాత్రం బాయ్ ఫ్రెండ్ చెక్ చేయడానికి లేదట. యంగ్ బ్యూటీ లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది. 
 

జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే. ఆమె విషయంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తన మొదటి చిత్రం ధడక్ హీరో ఇషాన్ కట్టర్ తో ఆమె ప్రేమాయణం నడిపారనే పుకార్లు వినిపించాయి. అనంతరం అక్షత్ రాజన్, ఓరి అవత్రమణి, శిఖర్ పహారియా...  జాన్వీ కపూర్ లవర్స్ అంటూ ప్రచారం పొందారు. వారితో జాన్వీ కపూర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి. 

రూమర్స్ అలా ఉండగా... జాన్వీ కపూర్ కి ఒక క్రేజీ ప్రశ్న ఎదురైంది. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ ని కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు ప్రశ్నలు అడిగారు. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేయవచ్చా?అని జాన్వీ కపూర్ ని ఓ అమ్మాయి అడిగింది. అవును బాయ్ ఫ్రెండ్ ఫోన్ అమ్మాయిలు చెక్ చేయవచ్చు. నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. అందులో తప్పు లేదు అన్నది. మరి అమ్మాయి ఫోన్ తన బాయ్ ఫ్రెండ్ చెక్ చేయవచ్చా? అని అడగ్గా... చేయకూడదు అని సమాధానం చెప్పింది జాన్వీ. 

అదేంటి అమ్మాయి ఫోన్ అబ్బాయి చెక్ చేయకూడదు, అబ్బాయి ఫోన్ అమ్మాయి చెక్ చేయవచ్చా? ఇదేం న్యాయం అని అడగ్గా... అమ్మాయిల మీద మీకు నమ్మకం లేదా అని జాన్వీ నవ్వుతూ సమాధానం చెప్పింది. జాన్వీ కపూర్ వీడియో వైరల్ అవుతుంది. 

janhvi😭😭😭 pic.twitter.com/WAGaZACTCb

— sarah (@sidxjk)

మరోవైపు జాన్వీ కపూర్ రెండు క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. సౌత్ లో అడుగుపెడుతూనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న దేవర షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. అక్టోబర్ 10న దేవర 1 విడుదల కానుంది. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్సీ 16లో జాన్వీ కపూర్ హీరోయిన్ గ ఎంపికైంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది... 
 

click me!