బాలయ్య,బోయపాటి సినిమా రిలీజ్ టైమ్ ఫిక్స్

By Udaya DFirst Published Mar 1, 2019, 7:53 AM IST
Highlights

సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పర్వ దినాల్లో తమ సినిమాలు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతాయని నమ్ముతూంటారు. 

సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పర్వ దినాల్లో తమ సినిమాలు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతాయని నమ్ముతూంటారు. అయితే ఆ సీజన్ లో ధియోటర్స్ అందరికీ దొరకవు. దిల్ రాజు వంటి నిర్మాతలకు, బాలయ్య వంటి హీరోలకు, మెగా క్యాంప్ కు సంక్రాంతి అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు బాలయ్య..సంక్రాంతికి వచ్చి అనేక హిట్స్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మరోసారి సంక్రాంతికే సిద్దపడుతున్నారు. అయితే సంక్రాంతి చాలా కాలం ఉంది కదా అన్నా వినేటట్లు లేరని తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే....బాలకృష్ణ తన స్పీడుకు కొద్దిగా బ్రేక్ లు వెయ్యబోతున్నారు. వరసపెట్టి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు రెండూ డిజాస్టర్ అవటం ఆయనకు పెద్ద షాకే తగిలింది. దాంతో బోయపాటి తో చేయబోయే చిత్రం పూర్తి స్క్రిప్టు పక్కాగా వండాకే వెళ్దామని క్లియర్ గా చెప్పారట. అంతేకాదు...పొలిటికల్ కథ అసలు వద్దని, దాని వలను తనకు ప్రస్తుతం కలిసొచ్చేదేమీ లేదని  చెప్పారట. 

దాంతో బోయపాటి మరో ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను తయారు చేసే పనిలో పడ్డారట. కేవలం స్టోరీ లైన్ విని ఓకే చేసేది లేదని పూర్తి బౌండ్ స్క్రిప్టుతో రమ్మని బోయపాటికి బాలయ్య పురమాయించాడట. అంతేకాదు తనకు సెంటిమెంట్ అయిన సంక్రాంతికే రిలీజ్ చేద్దామని, కంగారు ఏమీ లేదని అన్నారట.

ఇక బోయపాటి కూడా టెర్న్ లు డిక్టేట్ చేసే పరిస్దితిలో లేరు. తను డైరక్ట్ చేసిన వినయ విధేయ రామ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఆయన్ని వేరే నిర్మాణ సంస్దలు ఏమీ దగ్గర చేరనివ్వటం లేదు. మైత్రీ బ్యానర్ లో సినిమా చేస్తారనుకుంటే... వాళ్లు అడ్వాన్స్ వెనక్కి తీసేసుకున్నారు. ఈ నేపధ్యంలో బోయపాటి ఓ కొత్త కథ, కమర్షియల్ ఎంటర్టైనర్ ని వచ్చే సంక్రాంతికి తీసుకొచ్చి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారట.  జూలై నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాసం ఉంది. 

click me!