భక్తి కోసం వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు.. రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్‌

Published : Oct 04, 2022, 12:45 PM IST
భక్తి కోసం వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు.. రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్‌

సారాంశం

నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. మీడియా రిపోర్టర్‌పై ఆమె ఫైర్‌ అయ్యారు. దీంతో ఆమె వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నారు.

నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె మరో సారి హాట్‌ టాపిక్‌గా మారింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాన హేమ మీడియాపై ఫైర్‌ అయ్యింది. తాను భక్తికోసం వచ్చాను, కాంట్రవర్శి కోసం కాదంటూ వ్యాఖ్యానించింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే. నటి హేమ మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకోవడానికి వచ్చింది.  

శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా హేమ ఇంద్రకీలాద్రి అమ్మవారిని  దర్శించుకుంటారు.  ఈ ఏడాది కూడా  వచ్చారు. దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది ప్రోటోకాల్‌ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటెత్తి వస్తున్నారని,  దీంతో ఏడాది అమ్మవారిని దర్శించుకోవడం కుదురుతుందో లేదో అనుకున్నానని అని తెలిపింది. 

కానీ అమ్మవారు తనని ఇక్కడికి రప్పించారని, ఇక్కడ దర్శించుకున్న భక్తులు  చాలా పుణ్యం చేసుకున్నారు.  మీ అందరికి కొండంత ధైర్యం ఇవ్వమని  అమ్మవారిని కోరుకుంటున్నా అని తెలిపింది హేమ. ఇంతలో ఓ రిపోర్టర్‌ ఓ ప్రశ్న సందించారు. టికెట్‌ తీసుకున్నారా అని  ప్రశ్నించారు. దీంతో చిర్రెత్తిపోయిన నటి హేమ అతనిపై సీరియస్ అయ్యింది. 

మేం ఇద్దరం వచ్చాం. హుందీలో పదివేలు వేశాను. అమ్మవారికి 20వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్‌ గురించి మాట్లాడుతున్నారు. ఫోటో కాల్‌ ప్రకారమే ఫాలో అయ్యాం. దీన్ని  కాంట్రవర్శి చేయడం  సరికాదు. తాను భక్తికోసం వచ్చాను. కాంట్రవర్సికోసం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాసేపు అలజడి సృష్టించి పోయింది హేమ. 

నటి హేమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అత్త పాత్రలు, వదిన పాత్రలు, అక్క పాత్రలు చేస్తూ రాణిస్తుంది. ఒకప్పుడు బ్రహ్మానందం పెయిర్‌గా ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గాయి. `బిగ్‌బాస్‌ 3`లో కొన్ని రోజులు సందడి చేసింది హేమ. ఇప్పుడు చాలా తక్కువగా మెరుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్
చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి