నేను పొగాకు ప్రమోట్ చేయలేదు.. హీరో కామెంట్స్!

Published : May 16, 2019, 10:31 AM IST
నేను పొగాకు ప్రమోట్ చేయలేదు.. హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను పొగాకు ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదని రాజస్తాన్ కి చెందిన నానక్ రామ్(40) అనే వ్యక్తి కోరిన సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను పొగాకు ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదని రాజస్తాన్ కి చెందిన నానక్ రామ్(40) అనే వ్యక్తి కోరిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ ప్రమోట్ చేసిన పొగాకును వాడడం వలన తనకు క్యాన్సర్ వచ్చిందని.. ఇకపై ఆయన పొగాకుని ప్రమోట్ చేయకూడదని కోరారు.

ఈ విషయంపై స్పందించిన అజయ్ సదరు అభిమానితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కంపనీ ఒప్పందం ప్రకారం పొగాకు ప్రమోట్ చేయలేదని, వాణిజ్య ప్రకటనల కోసం ఇలాచీలానే ఉపయోగించారని.. తన ఒప్పందం ప్రకారం అది పొగాకు కాదని అన్నారు.

ఒకవేళ ఆ కంపనీ ఇలాచీని కాకుండా మరేదైనా అమ్మిందా..? అనే విషయం తనకు తెలియదని అన్నారు. నటుడిగా తన బాధ్యత గురించి ప్రస్తావిస్తూ మీడియాలో మాట్లాడుతూ.. తన తాజా చిత్రం 'దే దే ప్యార్ దే'లో పొగ తాగని వ్యక్తి పాత్రను పోషించినట్లు చెప్పారు.

అలానే కొన్ని సినిమాలలో పాత్ర ప్రకారం పొగ తాగకుండా ఉండలేమని.. కాబట్టి నటులు ఇలా చేయకూడదని చెప్పడంతో అర్ధం లేదని, పాత్ర ప్రకారం నడుచుకోవాల్సి వస్తుందని అజయ్ వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి