'సై రా' సినిమా ఆర్టిస్ట్ మృతి!

Published : May 16, 2019, 10:16 AM IST
'సై రా' సినిమా ఆర్టిస్ట్ మృతి!

సారాంశం

హైదరాబాద్ లో ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ లో ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్‌ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్ కి వచ్చారు.

మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో గచ్చిబౌలిలో డీఎల్ఎఫ్ గేటు నెంబర్ 1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పోలీసులు వెంటనే కొండాపూర్ లో ఓ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు గాంధీ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ అలెగ్జాండర్‌ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు.

మృతుడికి చెందిన కెమెరాలో ఫోటోల ఆధారంగా ఈ నెల 4,5 తేదీల్లో 'సై రా' సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలో హోటల్ లో నివాసమున్న అలెగ్జాండర్‌ ఆ తరువాత ఖాళీ చేసి రోడ్లపైనే తిరుగుతున్నారు.

వడదెబ్బ కారణంగా అలెగ్జాండర్‌ మృతి చెందారని.. గోవాలో ఉండే అతడి స్నేహితుడు బోరెజ్ కి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాత పోస్ట్ మార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..