పోలిటికల్ ఎంట్రీ.. వినాయక్ ఏమంటున్నాడంటే..?

Published : Jan 16, 2019, 07:55 AM IST
పోలిటికల్ ఎంట్రీ.. వినాయక్ ఏమంటున్నాడంటే..?

సారాంశం

గత కొంతకాలంగా ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 

గత కొంతకాలంగా ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని కొన్ని సార్లు, వైయస్సార్పీ లో ఉండబోతున్నారంటూ కొన్ని సార్లు మీడియావాళ్ళు ఆయన రాజకీయ జీవితం గురించి వార్తలు రాసేసారు. అయితే అవన్ని కేవలం రూమర్స్ అని కొట్టి పారేసారు వినాయిక్. 

అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు  వి.వి.వినాయక్‌ . సంక్రాంతి సందర్బంగా సోమవారం ఆయన స్వగ్రామం  చాగల్లు వచ్చారు. అక్కడ  ఆయన  మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.  

వినాయిక్ మాట్లాడుతూ..ఇప్పటికే తన తమ్ముడు, మాజీ సర్పంచ్‌ సురేంద్ర కుమార్‌ రాజకీయాల్లో చురుకుగానే ఉన్నాడని అన్నాడని, తనకు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, అన్ని పార్టీల్లోను మిత్రులు ఉన్నారని వారితో స్నేహభావంతో కొనసాగుతానన్నారు.  రాజకీయంగా సోషల్ మీడియాలో , మీడియాలో  తన గురించి వచ్చే వాటిని నమ్మవద్దన్నారు.

త్వరలో తాను చేయబోయే చిత్రం గురించి చెప్తూ... సి.కల్యాణ్‌ నిర్మాతగా ప్రముఖహీరో నందమూరి బాలకృష్ణతో తదుపరి చిత్రం చేస్తున్నట్టు చెప్పారు. కథ చర్చలు జరుగుతున్నాయని, కొద్డి రోజుల్లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందన్నారు. ఇప్పటి వరకు 16 చిత్రాలకు దర్శకత్వం వహించగా 17వ చిత్రం ప్రారంభం కాబోతుందని చెప్పారు.  

అంతేకాకుండా తాను..సినీ నిర్మాతగా మారాలనే ఆలోచన కూడా విరమించాను అన్నారు.   ఒక దశలో నిర్మాత అవ్వాలని  ఆలోచించాను, కాని మిత్రుల సలహా మేరకు విరమించుకున్నట్టు తెలిపారు. అలాగే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లపై తనకు అవగాహన లేక వాటిని ఉపయోగించడం లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద